బ్రిటన్ కింగ్ చార్లెస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కోసం ఒక నిమిషం పాటు మౌనం పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. రాయల్స్ నల్లటి బాండ్లు ధరించనున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి.. దు:ఖంలో ఉన్న కుటుంబాలకు.. విషాదంలో ఉన్న అన్ని వర్గాలకు గౌరవ చిహ్నంగా 76 ఏళ్ల చార్లెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Israel Strikes: ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
కింగ్ చార్లెస్ III పుట్టినరోజు నవంబర్ 14న జరుగుతుంది. కానీ సాంప్రదాయకంగా బ్రిటిష్ చక్రవర్తి బహిరంగ వేడుకలు వెచ్చని వాతావరణం కోసం జూన్ మధ్యలో జరుగుతుంటాయి. ఇందులో భాగంగా శనివారం కవాతు జరగనుంది. ఈ సమయంలో ఎయిరిండియా మృతులకు చార్లెస్ ఒక్క నిమిషం పాటు సంతాపం వ్యక్తం చేయనున్నారు. లండన్‌లో హార్స్ గార్డ్స్ పరేడ్‌లో కింగ్ చార్లెస్ గార్డును పరిశీలించిన తర్వాత ఒక నిమిషం మౌనం పాటించనున్నారు.
ఇది కూడా చదవండి: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు..
ఇక గురువారం ప్రమాద వార్త తెలిసిన వెంటనే కింగ్ చార్లెస్, భార్య క్వీన్ కెమిల్లా విచారం వ్యక్తం చేశారు. ఎయిరిండియా ప్రమాదం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. చాలా విషాదకర సంఘటనగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
గురువారం మధ్యాహ్నం ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడికోలో ఉంటున్న హాస్టల్‌పై విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. ఇక 15 మంది మెడికోలు కూడా చనిపోయినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. మొత్తంగా 265 మంది విమాన ప్రమాదంలో చనిపోయారు. ఇక మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని (68) కూడా ఉన్నారు. లండన్‌లో ఉంటున్న కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.కోటి పరిహారం ప్రకటించింది.