బ్రిటన్ రాజకుటుంబంలో భారీ కుదుపు జరిగింది. అగ్ర రాజ్యం అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం రాజకుటుంబంలో రక్తసంబంధానికి చీలిక తెచ్చింది.. జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, ధనవంతులతో పాటు బ్రిటన్ యువరాజు ఆండ్రూ పేరు కూడా ఉంది. దీంతో కింగ్ చార్లెస్ III కఠిన చర్యలకు పూనుకున్నారు. తమ్ముడు ఆండ్రూను ఇంటి నుంచి బలవంతంగా బయటకు గెంటేశారు. అంతేకాకుండా ఆండ్రూకు ఉన్న అన్ని బిరుదులన్నీ తొలగించారు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Kash Patel: చిక్కుల్లో ఎఫ్‌బీఐ చీఫ్.. ప్రియురాలి కోసం జెట్‌లో షికార్లు
ఆండ్రూ.. దివంగత రాణి ఎలిజబెత్ రెండో కుమారుడు. కింగ్ చార్లెస్ తమ్ముడు. అమెరికాలో సెక్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన పత్రాల్లో ఆండ్రూ పేరు బయటకు వచ్చింది. ఈ క్రమంలో ఆండ్రూకు ఉన్న అన్ని బిరుదులు, గౌరవాలు, అధికారాలను చార్లెస్ తొలగించారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. ప్రస్తుతం లీజుకు తీసుకుని ఉంటున్న లండన్‌లోని విండ్సర్ ఎస్టేట్‌ను కూడా ఖాళీ చేయాలని అధికారిక నోటీసులు పంపించినట్లు పేర్కొంది. ఆండ్రూ తూర్పు ఇంగ్లాండ్‌లోని సాండ్రిగ్‌హోమ్ ప్రైవేటు ఎస్టేట్‌లోకి మారతారని తెలిపింది. ప్రస్తుతం కింగ్ చార్లెస్ కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. బ్రిటిష్ చరిత్రలోనే రాజకుటుంబ సభ్యుడిపై చర్య తీసుకోవడం విస్మయానికి గురి చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: ఐక్యతా విగ్రహం దగ్గర వల్లభాయ్ పటేల్‌కు మోడీ నివాళి
ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఆరోపణలను ఆండ్రూ పలుమార్లు ఖండించారు. అయినా కూడా చార్లెస్ చర్యలకు ఉపక్రమించారు. కింగ్ చార్లెస్, రాణి కెమిల్లా బాధితుల వైపే ఉంటారని బకింగ్‌హామ్ ప్యాలెస్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆండ్రూపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఆండ్రూ నావికాదళ అధికారిగా పని చేశాడు. 1980లో అర్జెంటీనాతో ఫాక్లాండ్స్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. వర్జినియా గ్రిఫీ అనే బాధితురాలు ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక ఆరోపణలు చేసింది. 17 ఏళ్ల వయసులో యువరాజు తనను పలుమార్లు అనుభవించాడని వాపోయింది. గ్రిఫీ రాసిన ‘నోబడీస్ గర్ల్’ (Nobodys Girl) అనే పుస్తకంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించింది.
ఇది కూడా చదవండి: Bihar Elections: నేడు ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల.. 4 అంశాలపై ఫోకస్!