Khyber Pakhtunkhwa: ప్రపంచంపై ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాపం ఇప్పుడు పాకిస్థాన్‌ను పట్టిపీడుస్తుంది. ఇటీవల కాలంలో దాయాది దేశంలోనే అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందుగా పాక్-భారత్ ఘర్షణలు, తర్వాత దాయాది దేశంలో పర్యావరణ ప్రకోపం, ఆ తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌తో సంఘర్షణలు. ఇవన్నీ పాకిస్థాన్ చేసుకున్న స్వయంకృత పాపాలే. తాజాగా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాపై దాయాది దేశం పట్టుకోల్పోతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంతకీ పాకిస్థాన్‌లో ఏం జరుగుతుంది.. READ ALSO: DYCM Pawan Kalyan: అటవీశాఖ…
Afghan-Pak War: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కుమ్ముకున్నాయి. కుర్రం జిల్లాలో పాకిస్తాన్ దళాలు, ఆఫ్ఘాన్ తాలిబాన్ల మధ్య మంగళవారం రాత్రి మరోసారి దాడులు ప్రతి దాడులు జరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ తమ 23 మంది సైనికులు మరణించినట్లు, 200 మందికి పైగా తాలిబాన్లను చంపినట్లు చెప్పింది.
Pakistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన ఎయిర్ స్ట్రైక్స్, పాక్ ఆర్మీపై తాలిబాన్ల దాడులు, భారత్‌లో తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తాఖీ పర్యటన పాకిస్తాన్‌లో తీవ్ర భయాలను పెంచుతున్నట్లు స్పష్టం తెలుస్తోంది. తాజాగా, పాకిస్తాన్ ఆర్మీ సంచలన ఆరోపణలు చేసింది. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్‌ను ‘‘ఉగ్రవాద కార్యకలాపాలకు స్థావరం’’గా, పాకిస్తాన్‌ను వ్యతిరేకంగా ఉపయోగిస్తోందని ఆరోపించింది.
Pakistan: పాకిస్తాన్‌కు నిద్రలేని రాత్రుల్ని మిగుల్చుతున్నారు పాక్ తాలిబాన్లు. తాజాగా మరోసారి పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా దాడులు చేశారు. ఈ ఘటన ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని ఖైబర్ జిల్లాలో జరిగింది. తిరా ప్రాంతంలోని హైదర్ కందావో సైనిక పోస్టుపై దాడి జరిగింది. ఈ దాడిలో కనీసం 11 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఇత్తిహాదుల్ ముజాహిదీన్ పాకిస్తాన్‌తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులు దాడికి పాల్పడినట్లు ప్రకటించాయి.
Pakistan: పాకిస్తాన్ పెంచుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు ఆ దేశాన్ని కబలించాలని చూస్తున్నారు. బలూచిస్తాన్‌లో ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ తాలిబాన్లు ఆ దేశానికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆర్మీ కూడా భయపడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో పోలీసులు, సైన్యం టార్గెట్‌గా తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్ని ఎదుర్కోలేక పాకిస్తాన్ చతికిలపడుతోంది.
ఖైబర్ పఖ్తుంఖ్వా గ్రామంపై పాక్ వైమానిక దళం బాంబుల వర్షం కురిపింది. 8 బాంబులు వేయడంతో 30 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారు. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) రహస్య స్థావరాలు లక్ష్యంగా పాక్ వైమానిక దళాలు దాడి చేయగా.. గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులెవరూ కూడా చనిపోలేదు. చనిపోయిన వారందరూ పౌరులే ప్రాణాలు కోల్పోయారు.
Operation Sindoor: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకినట్లు ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, పీఓకేతో పాటు పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మురిడ్కే లోని లష్కరే తోయిబా, బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధానకార్యాలయాలను పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో, పీఓకేతో పాటు భారత సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలను వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Pakistan: పాకిస్తాన్‌లో అనుకోని ప్రమాదం జరిగింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా(కేపీకే) ప్రావిన్సులో ‘‘మోర్టార్ షెల్’’ పేలుడుతో ఐదుగురు పిల్లలు మరణించారు. మరో 13 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. లక్కీ మార్వాట్ జిల్లాలోని ఒక గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నలుగురు బాలికలు ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Pakistan: పుల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా 2019లో భారత్ చేపట్టిన ‘‘బాలాకోట్ ఎయిర్ స్టైక్స్’’ సమయంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అభినందన్ వర్థమాన్ అనుకోకుండా పాక్ ఆర్మీకి చిక్కారు. ఆ సమయంలో, ఆయనను పట్టుకున్న పాక్ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా ఇటీవల తాలిబాన్ దాడుల్లో హతమయ్యాడు. ఆయన అంత్యక్రియలను పాక్ సైన్యం పెద్ద ఎత్తున నిర్వహించింది.
భారత్ దాడి తర్వాత పాకిస్తాన్ భయాందోళనలో ఉంది. రెండు రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్ దాడి నుంచి తేరుకోక ముందే పాక్ లో పోలీస్ వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పెషావర్‌లోని చమ్కానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ రోడ్‌లోని పశువుల మార్కెట్ సమీపంలో పోలీసు మొబైల్ వ్యాన్‌పై ఆత్మాహుతి దాడి జరిగిందని ఎస్ఎస్పి మసూద్ బంగాష్ తెలిపారు. Also…