Pakistan: 26 మంది టూరిస్టుల్ని బలి తీసుకున్న పహల్గామ్ ఉగ్రవాద ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ భయపడి చస్తోంది. ఇదిలా ఉంటే, పాక్ అంతర్గత పరిస్థితులు కూడా ఆశాజనకంగా లేవు. బలూచిస్తాన్‌లో బీఎల్ఏ, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబాన్ల దెబ్బకు పాక్ సైన్యం తోకముడుస్తోంది. పాక్ సైన్యంలో పంజాబ్ ఆధిపత్యాన్ని ఇతర ప్రాంతాలు సహించడం లేదు. Read Also: Shahid Afridi: షాహిద్…
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత సంస్థతో సంబంధం ఉన్న 10 మంది ఉగ్రవాదులు మరణించారని ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది
Breaking News: బలూచిస్తాన్‌లో రైలు హైజాక్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబన్ల దాడులతో పాకిస్తాన్ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది.
Pakistan : పాకిస్తానీ ఉగ్రవాదులకు సోమవారం అంటే చావుదినం లాంటిది. ఇప్పుడు సోమవారం రాగానే ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుడుతుంది. తమకు సురక్షితమైన స్థలం కోసం వెతకడం ప్రారంభించినట్లు కనిపిస్తుంది.
Taliban: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పాకిస్తాన్ తన భూభాగాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో తాలిబన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా తాలిబన్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఆర్మీ ఔట్‌పోస్టులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని కుర్రం, ఉత్తర వజీరిస్తాన్‌లోని గిరిజన జిల్లాలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. ప్రాణనష్టంపై ఖచ్చితమైన సమచారం లేనప్పటికీ, రెండు వైపుల భారీగా ఆయుధాలను మోహరించినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో జరిగిన మత ఘర్షణల్లో 100 మంది చనిపోయారని ఆసుపత్రి సిబ్బంది గురువారం మీడియాకు తెలిపింది.
Pakistan : పాకిస్థాన్‌లో మరో జర్నలిస్టును దారుణంగా హత మార్చారు. ఆదివారం దేశంలోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కెపి) ప్రావిన్స్‌లోని నౌషేరా నగరంలో కొందరు గుర్తు తెలియని దుండగులు స్థానిక జర్నలిస్టును కాల్చిచంపారు.
Child Marriage: పాకిస్తాన్ దేశంలోని స్వాత్ లోయలో ఓ 70 ఏళ్ల వృద్ధుడు, 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త అక్కడి మీడియాలో హెడ్‌లైన్‌గా మారింది.
Pakistan : పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు చిన్నారులపై లైంగిక దోపిడీ, అత్యాచారానికి సంబంధించిన అతిపెద్ద కేసు వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లోని ఖైబర్-పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ వరసగా తీవ్రవాద దాడులతో అట్టుడుకుతోంది. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో మిలిటెంట్లు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు ప్రావిన్సుల్లో గత రెండు రోజులుగా జరిగిన దాడుల్లో మొత్తం 18 మంది మరణించారు.