Pakistan: పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు చైనీస్ ఇంజనీర్లు మరణించారు. అయితే, ఈ పరిణామంపై చైనా తన ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాలంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతోంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం పాక్-చైనా స్నేహానికి శత్రువులుగా ఉన్నవారే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తోంది.
Pakistan: పాకిస్తాన్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 48 గంటల్లో కురిసిన వర్షాలకు ఆ దేశంలో 37 మంది మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. పాక్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కూలిపోవడం, కొండ చరియలు విరిగిపడటం జరుగుతోంది. ముఖ్యంగా వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ తవ్రంగా ప్రభావితం అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ ప్రావిన్సులో గురువారం రాత్రి నుంచి మొదలైన భారీ వర్షాల కారణంగా 27 మంది మరణించారని, వీరిలో…
పాకిస్థాన్‌లో (Pakistan) సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది (Election Day). అయితే ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని అనుకుంటున్న సమయంలో బలూచిస్థాన్ (Balochistan), ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో రెండు చోట్ల పేలుళ్లు సంభవించాయి.
Pakistan : ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సమయంలో పాకిస్థాన్‌లో పలు చోట్ల హింస, ఉగ్రవాద ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి.
Pakistan: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో అందరూ భయాందోళనకు గురవుతున్న సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఓ గ్రామంలోని ఓ ఇంట్లో 11 మంది మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Pakistan: పాకిస్తాన్ దేశంలో వరసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రావడం, ఉగ్రవాదిని పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపేసి అంతే వేగంతో మాయమవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకు భారత వ్యతిరేక ఉగ్రవాదులు 19 మంది ఇలాగే చనిపోయారు. ఆదివారం రోజు లష్కరే తోయిబా ఉగ్రసంస్థకి చెందిన కీలక ఉగ్రవాది హబీబుల్లాని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో కాల్చి చంపారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. వజీరిస్థాన్‌లోని గుల్మిర్‌కోట్ ప్రాంతంలో ఓ వ్యాన్ కార్మికులతో వెళ్తున్న వ్యాన్‌ను ఉగ్రవాదులు పేల్చివేశారు. శనివారం షావాల్ తహసీల్‌లోని గుల్మీర్ కోట్ సమీపంలో 16 మంది కూలీలతో వెళ్తున్న వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చివేశారని డిప్యూటీ కమిషనర్ రెహాన్ గుల్ ఖట్టక్ తెలిపారు.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని మలాకాండ్ జిల్లాలో జరిగింది. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఇద్దరు పిల్లలు చనిపోయారు. కాల్పుల్లో 12 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా మీద పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా (కెపి) ప్రావిన్షియల్ అసెంబ్లీలను రద్దు చేయమని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా తనకు సలహా ఇచ్చారని ఆయన చెప్పారు. ఆదివారం ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ కీలక విషయాలు చెప్పారు.