కశ్మీర్ భూమిపై మరోసారి భారతీయుల రక్తం చిందింది. సెలవుల్లో ఆహ్లాదంగా గడుపుదామని పహల్గామ్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృత్యుఒడికి చేరుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంటల్లో భర్త కాటికి, భార్య సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటివరకు కాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా దీనిని పరిగణిస్తున్నారు. ఇందులో 28 మంది మరణించినట్లు సమాచారం. అయితే.. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది.…
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో పాకిస్థాన్‌కు ఎటువంటి సంబంధం లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బుధవారం అన్నారు. పొరుగు దేశంలో అశాంతికి భారతదేశం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అధికార PML-N పార్టీ సీనియర్ నాయకుడు, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సన్నిహితుడు అయిన ఆసిఫ్, జమ్మూ కాశ్మీర్‌లో హింసకు కేంద్రపాలిత ప్రాంతంలోని విప్లవం, స్వదేశీ శక్తులే అంటూ కల్లబొల్లి మాటలు చెప్పారు.
కాశ్మీర్‌లో ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్‌కు పాకిస్థాన్ మద్దతు ఇవ్వడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాకిస్థాన్ ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
పాకిస్థాన్‌లో గతేడాది మే 9న జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌సై సైనిక విచారణకు అవకాశం ఉందని రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తనను సైనిక కస్టడీకి అప్పగించకుండా అడ్డుకోవాలని కోరుతూ ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ పిటిషన్ దాఖలు చేశారు.
Pakistan: ఇటీవల పాకిస్తాన్‌లో దైవదూషణ చేస్తున్నాడనే నెపంతో ఓ స్థానిక పర్యాటకుడిని ప్రజలు అత్యంత దారుణంగా కొట్టి, సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. మతం పేరుతో ఇలా క్రూరంగా ప్రవర్తించడంపై చాలా విమర్శలు వచ్చాయి. బాధితుడు మహ్మద్ ఇజ్మాయిల్ బహిరంగంగా మతోన్మాద గుంపు కాల్చి చంపింది.
Pakistan defence minister’s bizarre theory about population growth: పాకిస్తాన్ మంత్రులు, అక్కడి ప్రజల అవివేకం చాలా సందర్భాల్లో చూశాం. తెలిసీతెలియని విధంగా కొత్తకొత్త ప్రతిపాదనలు, సిద్ధాంతాలు పుట్టించడంలో పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధహస్తులు. ఏ సమస్య వచ్చినా.. కూడా ఆర్మీ, అటామిక్ ముల్క్ అని చెప్పడం తప్పితే పాకిస్తాన్ పెద్దగా చేయగలిగింది ఏం లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అయినా కూడా అక్కడి ప్రభుత్వానికి తత్వం బోధపడటం లేదు. ఎంతసేపు…