Pakistan: పాక్‌లో హిందువులు, సిక్కులు సురక్షితంగా లేరు..ఆ దేశ మంత్రి ఆందోళన..
- పాకిస్తాన్‌లో హిందూ
- సిక్కులు
- మైనారిటీలు సేఫ్‌గా లేరు..
- మైనారిటీలపై మతోన్మాదుల దాడి..
- పాక్ పార్లమెంట్‌లో మంత్రి వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇటీవల పాకిస్తాన్‌లో దైవదూషణ చేస్తున్నాడనే నెపంతో ఓ స్థానిక పర్యాటకుడిని ప్రజలు అత్యంత దారుణంగా కొట్టి, సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. మతం పేరుతో ఇలా క్రూరంగా ప్రవర్తించడంపై చాలా విమర్శలు వచ్చాయి. బాధితుడు మహ్మద్ ఇజ్మాయిల్ బహిరంగంగా మతోన్మాద గుంపు కాల్చి చంపింది.
తీవ్రవాద భావజాలంపై సొంత దేశ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోమవారం మాట్లాడుతూ.. దేశంలో హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, చిన్న ముస్లిం వర్గాలు, ఇతర మైనారిటీ సమూహాలు మతం పేరుతో టార్గెటెడ్ హింసకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మతం పేరుతో జరుగుతున్న హింసపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
Read Also: Gupta Nidhulu: గుప్తనిధుల పేరుతో బడా మోసం.. గుట్టురట్టు చేసిన పోలీసులు
రోజూ మైనారిటీలు హత్యకు గురవుతున్నారని, ఇస్లాం ముసుగులో వారికి భద్రత లేదని చెప్పారు. తాను మైనారిటీ భద్రత సమస్యను పరిష్కరించాలనుకుంటున్నానని, కానీ ప్రతిపక్షాలు నా ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయని , పాకిస్తాన్ ప్రపంచ అవమానాన్ని ఎదుర్కొంటున్నారని ఆసిఫ్ అన్నారు. రాజ్యాంగ భద్రత ఉన్నప్పటికీ మైనారిటీలకు పాకిస్తాన్‌లో రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. పాకిస్తాన్‌లో చిన్న ముస్లిం వర్గాలు కూడా సురక్షితంగా లేవని, ఇది అవమానకరమైన పరిస్థితి అన్నారు. హత్యలకు గురవుతున్నవారు దైవదూషణలకు సంబంధించిన ఆధారాలు లేవని, హత్యలు వ్యక్తిగత పగలతో జరుగుతున్నాయని చెప్పారు.
పాకిస్తాన్‌లో మైనారిటీలైన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు బలవంతమైన మతమార్పిడులు, అపహరణలు, హత్యలను ఎదుర్కొంటున్నారని హ్యూమర్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్(HRCP) నివేదించింది. దీనికి తోడు అహ్మదీయ సమాజంలో హింసాత్మక చర్యలు, తీవ్రమైన వేధింపులకు గురవుతున్నార నివేదికలు చెబుతున్నాయి. క్రైస్తవులు ఉపాధి, విద్యలో వివక్షను ఎదుర్కొంటారు.
తాజావార్తలు
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!