Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో చావు తప్పించుకున్నప్పటికీ, ఆ దేశానికి సిగ్గు రావడం లేదు. తాజాగా, ఆయన మాట్లాడుతూ.. తూర్పు సరిహద్దులో భారత్‌తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘానిస్తాన్‌తో టూ-ఫ్రంట్ వార్‌కు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస్తాన్ రెండు దేశాలతో యుద్ధానికి ‘‘పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. ఢిల్లీ ఉగ్రవాద దాడి సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Pakistan: భారతదేశంలో ఎప్పుడు ఉగ్రవాద దాడి జరిగిన, దాని మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయి. అయితే, ఈ నిజాన్ని ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఒప్పుకోదు. తమ ప్రమేయం లేదని చెబుతుంటుంది. ఈసారి కూడా అదే ప్రయత్నం చేసింది. ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్‌ను తక్కువ చేసేలా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ ఉగ్రదాడి గురించి స్పందిస్తూ.. ‘‘గ్యాస్ సిలిండర్ పేలుడు’’గా ఆసిఫ్ అభివర్ణించారు. భారత్ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని వాడుకుంటోందని ఆరోపించారు.
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య చర్చలు మళ్లీ విఫలం అయ్యాయి. ఇస్తాంబుల్ వేదికగా రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకుండా చర్చలు ముగిశాయి. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలం అయ్యాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు.
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య గురువారం మరొకసారి శాంతి చర్చలు జరగనున్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్‌లో చివరి విడత చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే పలు మార్లు రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి. కానీ సత్‌ఫలితాన్ని ఇవ్వలేదు.
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. భారతదేశం పాకిస్తాన్‌పై ద్విముఖ పోరు చేస్తుందని ఆరోపించారు. రెండు సరిహద్దుల్లో యుద్ధం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్ ప్రాక్సీగా ఉపయోగించుకుంటుందని ఆయన అన్నారు.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. భారతదేశం లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు. తాజాగా పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు విఫలమయ్యాయి.
Pak-Afghan: ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ మధ్య టర్కీలో జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాలు మరోసారి యుద్ధానికి దగ్గరగా చేరాయి. చర్చలు విఫలమైనట్లు ఇరు దేశాలు స్టేట్ మీడియా వెల్లడించింది. చర్చలు విఫలమైతే ఆఫ్ఘాన్‌పై దాడులు చేయడం తప్పా వేరే మార్గం లేదని ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
Afghanistan Defence Minister Mullah Yaqoob: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణల్లో భారత్ కీలక పాత్ర పోషించిందని పాక్ రక్షణ మంత్రి పిచ్చికూతలు కూశారు. ఈ వాదనలను తాజాగా ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ ఖండించారు. అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాకూబ్ ఈ ఆరోపణలను నిరాధారంగా పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "ఈ వాదనలు నిరాధారమైనవి. మా భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించాలనే విధానం మాకు లేదు. మనది స్వతంత్ర…
Pakistan Afghanistan Ceasefire: ఎట్టకేలకు పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ దేశాలకు టర్కీ మధ్యవర్తిత్వం వహించింది. దోహాలో జరిగిన చర్చల సందర్భంగా వారం రోజుల భీకర సరిహద్దు ఘర్షణలను బ్రేక్ పడింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెల్లవారుజామున ప్రకటించింది. రాయిటర్స్ ప్రకారం.. కాల్పుల విరమణ సక్రమంగా అమలు చేసేలా చూసుకోవడానికి రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని…
Pakistan: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంతో ‘‘డ్యూరాండ్ లైన్’’ వద్ద తుపాకులు గర్జిస్తున్నాయి. ఇప్పటికే, రెండు వైపుల పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. ఇదిలా ఉంటే, కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, పాకిస్తాన ఆఫ్ఘాన్ సరిహద్దు జిల్లాలపై వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పాక్-అఫ్ఘాన్ వివాదాన్ని భారత్‌తో ముడిపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌లో సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ లో నివసిస్తున్న అందరు…