Khammam: పోడు భూముల వివాదంలో పోలీసులని ఉరికిచ్చి కొట్టిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారు లోని చంద్రాయపాలెం గ్రామంలో పోడు భూముల వ్యవహారంలో అక్కడ ఉన్న రెండు గిరిజన వర్గాల మధ్య వివాదం నెలకొంది.
తాను ఈ గడ్డ బిడ్డనని.. తనకు ఇక్కడి సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
Mallu Bhatti Vikramarka: ఉమ్మడి జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు వైరా మండలం స్నానాల లక్ష్మీపురం చేరుకుని సోదరుడి దశదినకర్మ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఖమ్మం జిల్లా ఉన్నాతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆగిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మంచినీటి సమస్య కొరత లేకుండా చూడాలి అని తెలిపారు.
ఖమ్మం నుంచి అశ్వరావుపేట మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన బ్రిడ్జి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న ముగ్గురు కూలీలు బ్రిడ్జి మించి ఒక్కసారిగా దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు.
రాష్ట్రంలో తాను చెప్పిన జోస్యం ప్రకారం అప్పటి మంత్రి అజయ్ తూడుచుకుపోతాడు అన్నానని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి వెల్లడించారు. అదే జరిగిందని ఆమె తెలిపారు. ఈ జిల్లాకు స్వేచ్ఛ వచ్చిందని, 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ఆమె పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఆ సమయంలో ఎవ్వరూ విద్యార్థులు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. జిల్లా కేంద్రంలోనే ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయంలో నిరంతరం ఉద్యోగస్తులు పని చేస్తుండేవారు. అదే విధంగా.. పై సెక్షన్ లో సుమారు 100 మంది చదువుకునే యువకులు ఉండేవారు. ప్రధానంగా యువకులు, మహిళలు ఈ గదిలో ఉండి పత్రికలు చదివేవారు.
ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా మాకు మనస్సుంది మార్గం దొరుకుతుంది అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఆరు నూరైనా ఖచ్చితంగా అమలు చేస్తాం.. మేం నాయకులం కాదు సేవకులం.. రెండు పర్యాయాలు నిరుద్యోగులు వేదనకు గురయ్యారు అంటూ కన్నీటి పర్యంతమైన మంత్రి పొంగులేటి.