ఖమ్మం నుంచి అశ్వరావుపేట మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన బ్రిడ్జి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న ముగ్గురు కూలీలు బ్రిడ్జి మించి ఒక్కసారిగా దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు.
రాష్ట్రంలో తాను చెప్పిన జోస్యం ప్రకారం అప్పటి మంత్రి అజయ్ తూడుచుకుపోతాడు అన్నానని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్నానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి వెల్లడించారు. అదే జరిగిందని ఆమె తెలిపారు. ఈ జిల్లాకు స్వేచ్ఛ వచ్చిందని, 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ఆమె పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఆ సమయంలో ఎవ్వరూ విద్యార్థులు లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. జిల్లా కేంద్రంలోనే ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయంలో నిరంతరం ఉద్యోగస్తులు పని చేస్తుండేవారు. అదే విధంగా.. పై సెక్షన్ లో సుమారు 100 మంది చదువుకునే యువకులు ఉండేవారు. ప్రధానంగా యువకులు, మహిళలు ఈ గదిలో ఉండి పత్రికలు చదివేవారు.
ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా మాకు మనస్సుంది మార్గం దొరుకుతుంది అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఆరు నూరైనా ఖచ్చితంగా అమలు చేస్తాం.. మేం నాయకులం కాదు సేవకులం.. రెండు పర్యాయాలు నిరుద్యోగులు వేదనకు గురయ్యారు అంటూ కన్నీటి పర్యంతమైన మంత్రి పొంగులేటి.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదలో తెలంగాణ యువకుడు మృత్యువాతపడ్డాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌కు చెందిన ముక్కర భూపాల్ రెడ్డి కుమారుడు సాయిరాజీవ్ రెడ్డి (28) టెక్సాస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఓ పార్సిల్ తీసుకోవడానికి కారులో విమానాశ్రయానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా ఓ ట్రక్కు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. సాయిరాజీవ్ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. Also Read: Gold Price Today :…
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఓ ప్రైవేట్ పంక్షన్ హల్ లో కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ జన్మదిన వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Ponguleti: మాటలు కాదు చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి మంత్రివర్గ సమావేశంలో ఆరు హామీలకు ఆమోదం తెలిపిందన్నారు.
కొత్త సంవత్సరం శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజానీకంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు, యవత్తు దేశ ప్రప్రంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలను రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. ఐదేళ్లపాటు డిప్యూటేషన్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఎస్పీగా విష్ణు వారియర్ సేవలందించనున్నారు. కాగా.. విష్ణు వారియర్‌ను స్టేట్ సర్వీస్ నుంచి వెంటనే రిలీవ్ చేయాలంటూ తెలంగాణ సీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాగా.. ప్రస్తుతం ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా విష్ణు వారియర్ విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
ఖమ్మం: పాలేరు అధికారులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలా జరిగిన పాలేరులో మాత్రం లంచం తీసుకుని పోస్టింగ్ ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. శనివారం పాలేరులోని కుసుమంచి మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ‘అధికారులు నా జ్ఞానేంద్రియాలు వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్రంలో ఎక్కడ ఎలా జరిగిన పాలేరులో మాత్రం లంచం…