Ramasahayam Raghuram Reddy : ఖమ్మం ఎంపీ అభ్యర్ధిగా విక్టరీ వెంకటేష్ వియ్యంకుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రస్తుత రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి పేరుని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు అలాగే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహ్మద్ వలీవుల్లా సమీర్ పేర్లను కాంగ్రెస్ పార్టీని ప్రకటించింది.ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామసహాయం రఘురాంరెడ్డి ఎవరో కాదు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అయిన విక్టరీ వెంకటేష్ కు వియ్యంకుడు..అలాగే రఘురామరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా వియ్యంకుడే కావడం విశేషం.తన ఇద్దరు కుమారుల్లో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను, చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిని వివాహం చేసుకున్నారు.
రఘురామ రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి ఏకంగా నాలుగుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. దీంతో రఘురామరెడ్డికి రాజకీయ పలుకుబడి గట్టిగానే ఉంది.రఘురాం రెడ్డి 2011-2013లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీ ఏ ) ప్యాటరన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వైస్ చైర్మన్ గా మరియు హైదరాబాద్ రేస్ క్లబ్ లో బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. రఘురాం రెడ్డితో పాటు వారి తాతముత్తాతలు సేవాదృక్పథ కుటుంబానికి చెందిన వారు.దీనితో కాంగ్రెస్ పార్టీ ఆయనవైపు మొగ్గుచూపినట్లు తెలుస్తుంది.కాగా ఏకంగా ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఖమ్మం సీటును ఆలస్యంగా ప్రకటించినా ఏమీ కాదనే ఉద్దేశ్యంతో పార్టీ ఈ సీటు అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ కాస్త ఆలస్యం చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి .
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
తాజావార్తలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!