Talasani Srinivas Yadav: స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని రోడ్ నెంబర్ 36లో గల ఫ్రీడమ్ పార్క్, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ హైదర్ బస్తీ పార్క్ సంతోషిమాత దేవాలయం సమీపంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలను నాటారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళులని తెలిపారు. ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని తెలిపారు. read…
కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు సిటీ చుట్టుపక్కల ఉన్న సబర్బన్ ప్రాంతాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ఏరియాల్లో బీజేపీకి చెక్ పెట్టడంతోపాటు పార్టీకి పునర్వైభవం తేవటమే లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 శాసన సభ నియోజకవర్గాలు ఉండగా 2018 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎలక్షన్లలో సైతం 150 వార్డులకు గాను నామమాత్రంగా రెండు చోట్లే నెగ్గింది. మూడో వార్డును ఉపఎన్నికలో…
తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభం అయ్యాయా? ఓ మాజీ నేత కూతురు టీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ లో కార్పోరేటర్ గా ఉన్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిగా వున్నారు. ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో విజయా రెడ్డి భేటీ అయ్యారు. తాను పార్టీ వీడుతున్నట్లు స్పష్టం చేసారు. గ్రేటర్ ఎన్నికల వేళ విజయా రెడ్డి డిప్యూటీ మేయర్…
కాంగ్రెస్‌లో పి. జనార్దన్‌రెడ్డి వారసుడిగా విష్ణువర్దన్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. పీజేఆర్ మరణంతో జరిగిన ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు విష్ణు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి మరోసారి అసెంబ్లీకిలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికలు విష్ణుకు కలిసిరాలేదనే చెప్పాలి. 2014 మూడోస్థానంలో నిలిచిన ఈ యువనేత.. 2018లో మళ్లీ పుంజుకున్నా.. రెండోస్థానానికే పరిమితం అయ్యారు. రెండు వరస ఓటములు కుంగదీశాయో ఏమో.. తర్వాత…
హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతులు మంజూరు చేయడంతో ట్యాంక్ బండ్ వద్ద వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కాబోతున్నది. దీనికి సంబందించిన ఏర్పాట్లును నిర్వహకులు వేగంగా చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఈ రోజు రాత్రి 9 గంటల తరువాత ఖైరతాబాద్ గణపతి దర్శనానికి అనుమతిని రద్దు చేశారు. రేపు తెల్లవారుజామున 3…
ప్లాస్టర్ ఆప్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు హైకోర్టు అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అందుబాటులో ఉన్న కుంటల్లో విగ్రహాలను నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని చేపడుతోంది. వినాయక చవితికి ముందునుంచే నగరపాలక సంస్థ మట్టి గణపయ్యలను ఏర్పాటు చేయాలని ప్రచారం చేసింది. దీంతో నగరంలో చాలా మంది ఎకో ఫ్రెండ్లీ గణపతులను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఖైరతాబాద్ గణపతిని ఎక్కడ నిమజ్జనం చేయాలి అనేదానిపై ప్రభుత్వం, అధికారలు సుమాలోచనలు చేస్తున్నారు.…