ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహంపై గణేష్ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 2022 నుంచి మండపంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించింది. అలాగే మట్టి విగ్రహమే పెడతామని ప్రకటించింది. గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం కీలకంగా మారింది.. కాగా, ఇప్పటివరకూ వినాయక విగ్రహాన్ని…
ఖైరతాబాద్‌లో భారీ గణపతి కొలువుదీరిన కారణంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. గణపయ్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు కాబట్టి వీలైనంత వరకు ప్రజలు సొంత వాహనాల్లో కాకుండా మెట్రో లేదా పబ్లిక్ వాహనాల్లో రావాలని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఖైరతాబాద్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహం మీదుగా వెళ్లే వాహనాలకు అనుమతించడంలేదు. లక్డీకపూల్‌లోని రాజ్‌దూత్ మీదుగా వచ్చే వాహనాలను మార్కెట్ వైపుకు మళ్లిస్తున్నారు. ఇక నెక్లెస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలకు ఐమాక్స్‌లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు…
వినాయక చవితి అంటే మనకు హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. హైదరాబాద్‌లో వేలాది మండపాల్లో వినాయకులు కొలువుదీరుతారు. అన్నింటికంటే స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించే వినాయకుడు మాత్రం ఖైరతాబాద్ వినాయకుడే అని చెప్పాలి. ఎందుకంటే, ప్రతి ఏడాది అడుగుచొప్పున పెంచుకుంటూ ఒక్కో ఏడాది ఒక్కో అవతారంలో గణపయ్య దర్శనం ఇస్తుంటారు. గతేడాది కరోనా కాలంలో కూడా మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 10 వ తేదీన వినాయక చవితి కావడంతో…
హైదరాబాదులో ఓ పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో మంటలు ఎగిసిపడటంతో దగ్ధమైపోయింది. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగడంతో వాహనంలో ఉన్నవారు వెంటనే అప్రమత్తమయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన వచ్చి మంటలు ఆర్పేశారు. ఈ ఘటనతో ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. టాటా సుమో ఇంజిన్ లో సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.