Talasani Srinivas Yadav: స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని రోడ్ నెంబర్ 36లో గల ఫ్రీడమ్ పార్క్, సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ హైదర్ బస్తీ పార్క్ సంతోషిమాత దేవాలయం సమీపంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలను నాటారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళులని తెలిపారు. ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని తెలిపారు.
read also: Andhra Pradesh Politics : ఏపీలో పొత్తు ఇబ్బందులు తొలగుతాయని బాబు భావనా?
దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి KCR ఆదేశాల మేరకు 15 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ అని పేర్కొన్నారు. గాంధీ గురించి విద్యార్థుల కు తెలియజెప్పేందుకు ఉచితంగా గాంధీ చిత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వజ్రోత్సవాలలో భాగంగా 75 ప్రాంతాల్లో ప్రీ డమ్ పార్క్ లను ఏర్పాటు చేసి మొక్కలు నాటడం జరుగుతుందని, ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగురవేసి జాతి సమైక్యత, స్ఫూర్తి ని చాటాలని మంత్రి తలసాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో.. రాజ్యసభ సభ్యులు K. కేశవరావు, MLA దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, GHMC కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Manchu Mohan Babu: మరో వివాదంలో మంచు మోహన్‌బాబు.. ఈ సారి షిర్డీ సాయినాథునిపై..!