కాంగ్రెస్ పార్టీకి ఓ దళపతి దొరికారు.. రేపటి నుంచి పోరాటమే చేస్తారని వ్యాఖ్యానించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఇవాళ టీఆర్ఎస్ ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కూతురు విజయారెడ్డిని కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల బస్తీ కోసం కొట్లాడిన మనిషి విజయారెడ్డి అన్నారు.. పీజేఆర్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే పీజేఆర్ అన్న ఆయన.. పీజేఆర్ బస్తీ ప్రజలకు దేవుడు.. పేదొల్ల కోసం కొట్లాడింది ఆయన ఒక్కరే అన్నారు.. తెలంగాణకి అన్యాయం జరిగితే సొంత పార్టీని కూడా నిలదీశారని గుర్తు చేసిన ఆయన.. కృష్ణా జలాల కోసం కొట్లాడిన నేత పీజేఆర్ అని.. ఆడ బిడ్డలకు అండగా నిలబడి నీళ్ల కోసం కొట్లాడారు.. ఆయన పోరాటం వల్లే భీమా, నెట్టెంపాడు వచ్చాయన్నారు.
Read Also: Vijaya Reddy: కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ తనయ విజయారెడ్డి
26 మంది ఎమ్మెల్యేలు గెలిచినా అసెంబ్లీలో అలుపెరగని పోరాటం చేసిన నేత పీజేఆర్ అన్నారు రేవంత్‌రెడ్డి.. ఈ మధ్య కొందరు నేనే తెచ్చిన కృష్ణ నీళ్లు అంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. సిగ్గు లేదా అంటూ మండిపడ్డారు.. పీజేఆరే కొట్లాడి కృష్ణా నీళ్లు తెచ్చారని గుర్తు చేశారు. ఏ కార్మికుడికి సమస్య వచ్చినా… అండగా నిలబడిన వ్యక్తి ఆయన అని ప్రశంసలు కురిపించారు.. హైదరాబాద్ లో చిన్న వర్షం పడినా.. పేదోళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, పేదల కోసం పని చేసేందుకు విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.. రేపటి నుండి పోరాటం చేస్తారు.. పీజేఆర్ లెక్క కొట్లడతారని ప్రకటించారు రేవంత్‌రెడ్డి.