Peddi Sudarshan Reddy: అసలు అవగాహనే లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లకు.. కుంభకోణం లో వున్నా ఉత్తమ కుమార్ రెడ్డి జైలు కి వెళ్లడం ఖాయం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ, బాలసముద్రం లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుంభకోణం లో వున్నా ఉత్తమ కుమార్ రెడ్డి జైలు కి వెళ్లడం ఖయమని తెలిపారు. ఇది వరంగల్ అడ్డ ఏదిపడితే ఆదిమాట్లాడితే మర్యాదగా ఉండదన్నారు. మీరు చేసిన కుంబకోణంలో కాంగ్రెస్ పార్టీ వారు మీకు మద్దతుగా లేరన్నారు. అందుకే కేసీఆర్ పై పడి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటాదనే ఆశ తో ఇలా మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడ్డారు. నీ ఆటలు సాగవు.. నువ్వు జైలు కి పోవడం ఖాయమన్నారు. నీకు సిగ్గు, షేరం ఉంటే సివిల్ సప్లై మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు అంటూ సవాల్ విసిరారు. నువ్వు చేసిన కుంబకోణం మే నీకు ఉరితాడు అవుతాదన్నారు. ఒక్కప్పుడు నీటి పరిస్థితి ఇలా ఉందొ ఇప్పుడు ఇలా ఉందొ ప్రజలు గమనించాలన్నారు. అసలు అవగాహనే లేదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లకు అంటూ మండిపడ్డారు.
Read also: Bandi Sanjay: గణేష్ మండపాలకయ్యే కరెంట్ ఖర్చంతా నేనే చెల్లిస్తా.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
మరో వైపు వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్ట్ పైన ఒక ఆలోచన చేసింది కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ వారికీ అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. 4000 కోట్ల ప్రాజెక్ట్ ఉంటే,కాంగ్రెస్ వారు వచ్చి 10000 ల కోట్ల కి పెంచారాని ప్రతిపక్ష నాయకలు ఆ రోజులలో తెలిపారని అన్నారు. టీడీపీ, కాంగ్రేస్ లో శ్రీహరి వున్నారు.. ఇప్పుడు కూడా వారితోనే ఉన్నాడన్నారు. శ్రీహరి నీ విజ్ఞప్తి చేస్తున్న దేవాదాయ ప్రాజెక్ట్ గురించి మీ నోటి ద్వారా మాట్లాడిన వ్యక్తి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావ్ అని ప్రజలు ప్రశ్నినిస్తున్నారు. శ్రీహరి మీరు పార్టీ మారిన, మాట తప్ప కూడాదు ఆది పద్ధతి కాదన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నీ నిలదీస్తునారు అని ప్రతీ నెలకో కొత్త నాటకం తీసుకస్తున్నారని తెలిపారు. మీరు ఎన్ని నిందలు వేసిన, చిల్లర వేషాలు వేసిన ప్రజలు మిమ్ముల్ని నిలదీస్తూనే వుంటారని తెలిపారు.
Read also: Gabbar Singh Re-Release: గబ్బర్ సింగ్ సక్సెస్‌ను ఆయన ముందే ఊహించారు: హరీశ్ శంకర్
వ్యవసాయం పైన కనీస అవగాహనా లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటూ రాజయ్య అన్నారు. సిగ్గు,శెరం లేకుండ కనీస అవగాహనా లేకుండా దేవాదాయల ప్రాజెక్ట్ పైన మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులా పరిస్థితి ఆగమ్య గోచరంగా కనిపిస్తుందన్నారు. కేసీఆర్ పాలనాలో చెరువులు, కుంటలు ఎప్పడు నిండు కుండల కనిపించేవన్నారు. కడియం శ్రీహరి ఏ ఎండకు ఆ గొడువు పట్టేవాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి తన ప్రయోజనాలకోసం ఘనపూర్ నియోజకవర్గం నీ తాకట్టు పెట్టాడు. కాంట్రాక్టర్లతో మాట్లాడటం, పైసలు తీసుకోవడం ఇవే చేసాడని అన్నారు. దేవాదాయ ప్రాజెక్ట్ లో ఎక్కువ అవినీతి చేసి సంపాదించినది కడియం శ్రీహరి అని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్ కి వెన్నుపోటు పొడిచిన దద్దమ్మ నువ్వు అన్నారు. సిగ్గు షేరం నీకు ఉంటే ఇప్పటికయినా బీ అర్ ఎస్ పార్టీ నుండి గెలిచినా పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుండి పోటి చేసి గెలువు అంటూ సవాల్ విసిరారు. జీవితం చివరికి వచ్చావు, పోయే కాలంలో ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకో అన్నారు.
Sathya in Kadapa: సెప్టెంబర్ 4న కడపలో సత్య ఏజెన్సీస్ 30వ షోరూం ప్రారంభం.. భారీ ఆఫర్లు.. త్వరపడండి!