రాష్ట్రంలో వరదలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద బాధితుల విషయంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదని దుయ్యబట్టారు. 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సరిగా సాయం అందటం లేదని ఆరోపించారు. వరద వచ్చే ముందు, వచ్చిన తర్వాత బాధితులను పునరావాస కేంద్రాలను తరలించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది చేతకాని ప్రభుత్వం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ వదిలి చంద్రబాబు మీడియా మేనేజ్ మెంట్ చేస్తున్నారని కన్నబాబు విమర్శించారు.
Read Also: Ram Nagar Bunny: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. “రామ్ నగర్ బన్నీ” ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్..
బాధితుల్లో రోజులు గడుస్తున్న కొద్దీ భయం పెరుగుతోందని కన్నబాబు పేర్కొన్నారు. 45 మంది వరదల్లో ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అని మండిపడ్డారు. దీనికి ప్రభుత్వ ఫెయిల్యూర్ అని అన్నారు. వెలగలేరు దగ్గర DE గేట్లు ఎత్తుతామని రెవెన్యూ అధికారులకు చెప్పామని అంటుంటే కలెక్టర్ సమాచారం లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. వరదలపై ప్రభుత్వం ఒక్క రివ్యూ అయినా సీఎం చేశారా..? అని ప్రశ్నించారు. సినీ నటి గురించి ఆరా తీసిన సీఎంఓ వరదల గురించి ఆరా తీయలేదా అని విమర్శించారు. వరదలు, భారీ వర్షాలను ప్రభుత్వం తేలికగా తీసుకున్నట్టు అర్ధం అవుతుందని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Read Also: Sheikh Hasina: షేక్ హసీనాని ఇండియా నుంచి రప్పించేందుకు బంగ్లాదేశ్ చర్యలు..