ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరిగిపోతున్నాయి. ముంబై, చెన్నై, కేరళ.. ఇలా రోజుకో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ బృందం. ఇక తాజాగా కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ “ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ముఖ్య అతిధిగా విచ్చేసిన టోవినో బ్రదర్.. ఇకనుంచి మిమ్మల్ని బ్రదర్ అనే పిలుస్తాను.. థాంక్స్ వచ్చినందుకు.. ఇక మలయాళ అభిమానుల గురించి చెప్పాలి. నాకు, జక్కన్నకు మొదటి విజయాన్ని అందించింది మీరే.. నా మొదటి ఇండస్ట్రీ హిట్ ‘సింహాద్రి’ ఇక్కడ భారీ విజయం అందుకుంది. ఆర్ఆర్ఆర్ కూడా అలాంటి విజయాన్ని అందుకొంటుంది అని నమ్ముతున్నాను.
రాజమౌళి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇక చరణ్ తో నా అనుంబంధం గురించి చెప్పాలంటే.. చరణ్ నాలో సగభాగం.. అది ఎటు సైడ్ అని అడిగితే ఎడమ వైపు భాగం అంటాను.. ఎందుకంటే హార్ట్ అటే ఉంటుంది కాబట్టి. నేనేదో పబ్లిసిటీ స్టంట్ కోసం చెప్పడం లేదు.. దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.. నా బ్రదర్ చరణ్ తో 200 రోజులు గడిపే క్షణాలు నాకు ఇచ్చినందుకు.. ఈ బంధం కేవలం ‘ఆర్ఆర్ఆర్’ తోనే ముగిసిపోతుంది అని నేను అనుకోవడం లేదు. మా ఇద్దరి బంధం ‘ఆర్ఆర్ఆర్’ కన్నా ముందే మొదలయ్యింది. దేవుడిని కోరుకుంటున్నాను.. ఫ్యాన్స్ మీరుకూడా ప్రార్ధించండి.. మా స్నేహాం ఎప్పటికి ఇలాగే నిలిచి ఉండాలని కోరుకోండి. ఇక చివరగా రామ్ – చరణ్ అభిమానులిద్దరిని కోరుతున్నాను అందరు ఇళ్లకు జాగ్రత్తగా వెళ్ళండి” అని ముగించారు