Girl students remove innerwear at neet 2022 examination centre: దేశవ్యాప్తంగా ఆదివారం మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్-2022 జరిగింది. నీట్ పరీక్ష సందర్భంగా కేరళ రాష్ట్రం కొల్లాంలోని మార్తోమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్‌లో 100 మంది విద్యార్థినుల పట్ల నిర్వాహకులు అనుచితంగా ప్రవర్తించారు. లో దుస్తులు(బ్రా) విప్పిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. దీంతో పరీక్షకు వచ్చిన విద్యార్థినులంతా అవాక్కయ్యారు. అయితే పరీక్షకు సమయం అవుతుండడంతో చేసేదేమీ లేక విద్యార్థినులు అలాగే లో దుస్తులు విప్పి పరీక్షా హాలులోకి వెళ్లారు. తమ లో దుస్తులను ఓ డబ్బాలో పడేశారని.. పరీక్ష రాసిన అనంతరం వాటిని తీసుకున్నామని విద్యార్థినులు వాపోయారు.
Read Also: Monkey Pox: దేశంలో రెండో కేసు నమోదు.. కేంద్రం హై అలర్ట్
అయితే ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు విద్యార్థినుల లోదుస్తులు విప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై నిర్వాహకులను వివరణ కోరగా.. అమ్మాయిల లో దుస్తులకు బెల్ట్స్ ఉండటం వల్లే అలా చేయాల్సి వచ్చిందని తమ చర్యను సమర్థించుకున్నారు. ఆభరణాలు, మెటల్ వస్తువులు, ఎలాంటి వాచీలు, కెమెరాలు, టోపీ, బెల్ట్, పర్సు, హ్యాండ్ బ్యాగ్‌లకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. కేవలం చెప్పులను మాత్రమే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇచ్చామని నిర్వాహకులు తెలిపారు. కాగా 2017లో తమిళనాడులోని కన్నూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం.