Husband takes over as collector from wife: భార్య నుంచి కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న భార్యను బదిలీ చేసింది ప్రభుత్వం.. అయితే, ఆ బాధ్యతలను ఆమె భర్తే స్వీకరించడం హాట్ టాపిక్‌గా మారింది.. అందరినీ ఆశ్చ్యరానికి గురిచేస్తూ.. రాజకీయ దుమారం రేపుతోన్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టర్ రేణు రాజ్ తాజాగా బదిలీ అయ్యారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. ఆమె స్థానంలో శ్రీరామ్ వెంకట్రామన్‌ను కలెక్టర్‌గా నియమించింది సర్కార్.. రేణు, శ్రీరామ్.. ఇద్దరూ భార్యాభర్తలు కావడం ఓ విశేషం కాగా.. అతని పోస్టింగ్‌ను రద్దు చేయాలంటూ యూడీఎఫ్ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
Read Also: Animal : సందీప్ రణ్ బీర్ ని ‘గాడ్ ఫాదర్’ చేస్తున్నాడా!?
Also Read
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
అయితే, రేణు రాజ్, శ్రీరామ్ గతంలో వైద్యులుగా పనిచేశారు.. కానీ, ఆ తర్వాత ఐఏఎస్‌లుగా మారిపోయారు.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే వీరి పెళ్లి జరిగింది.. రాష్ట్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీరామ్… మంగళవారం భార్య రేణు నుంచి అలప్పుళ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.. తన సీటులో కూర్చోవల్సిందిగా శ్రీరామ్‌ను ఆహ్వానించిన రేణు.. షేక్ హ్యాండ్ ఇచ్చి చైర్‌లో కూర్చోబెట్టారు.. ఇదే సమయంలో యూడీఎఫ్ ఆందోళన నిర్వహించడంతో.. ఆయనకు నిరసనలతో స్వాగతం పలికినట్టు అయ్యింది. అయితే, యూడీఎఫ్ ఆందోళన చేయడం వెనుక అసలు కారణం వేరే ఉంది.. భార్య నుంచి భర్త బాధ్యతలు స్వీకరించినందుకు వారు నిరసన తెలియజేయలేదు.. ఎందుకంటే.. గతంలో శ్రీరామ్ వెంకట్రామన్‌పై ఓ కేసు నమోదైంది.. 2019లో శ్రీరామ్.. తన స్నేహితురాలితో కలిసి కారులో వెళ్తూ.. ఓ బైక్‌ను ఢీకొట్టగా.. ఆ బైక్‌పై ఉన్న జర్నలిస్టు కన్నుమూశాడు.. అయితే, ఆ కేసులో బెయిల్ పొంది, విచారణ ఎదుర్కొంటున్న శ్రీరామ్‌ను కేరళ సర్కార్ గత రెండేళ్ల క్రితం మళ్లీ విధుల్లోకి తీసుకుంది. జాయింట్ సెక్రటరీగా ఉన్న అతడికి ఇప్పుడు కలెక్టర్ పోస్టు ఇవ్వడంపై యూడీఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!