ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్యానాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో ఏ ప్రభుత్వం కొలువుదీరినా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుతోనే సాధ్యమవుతుందన్నారు. ఆప్ మంచి స్థాయిలో స్ధానాలను చేజిక్కించుకుంటుందని తెలిపారు. తమ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Tirmala Laddu Row: తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగం ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అలర్ట్
శుక్రవారం జగధ్రిలో పార్టీ అభ్యర్ధి ఆదర్శ్‌పాల్ గుజ్జర్‌కు మద్దతుగా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని తెలిపారు. బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాషాయ పాలకులు అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని ప్రజలకు అందించడం మినహా ప్రజల మేలు కోసం చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. ఈసారి రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Tirmala Laddu Row: తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగం ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అలర్ట్
కేజ్రీవాల్ నిజాయితీ లేని వ్యక్తి అని ప్రజలు అనుకుంటే ఓటు వేయొద్దన్నారు. ఢిల్లీ ప్రజలు తనను తిరిగి ఎన్నుకున్న తర్వాతే తిరిగి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానని చెప్పారు. తాను అనుకుంటే సీఎం సీటులో ఉండిపోగలనన్నారు. కానీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని.. ఇక ప్రజలే నిర్ణయించుకుంటారన్నారు. ఏ నాయకుడూ ఈ స్థాయి ధైర్యాన్ని ప్రదర్శించలేదని తాను భావిస్తున్నానట్లు కేజ్రీవాల్ తెలిపారు.
హర్యానాలో కాంగ్రెస్‌తో కలిసి ఆప్ వెళ్లాలని భావించింది. కానీ సీట్ల పంపకాల్లో తేడా రావడంతో పొత్తు చెడిపోయింది. దీంతో విడివిడిగా పోటీ చేస్తున్నాయి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Asteroid: భూమికి సమీపంగా వస్తున్న గ్రహశకలం.. నాసా ఏం చెబుతుందంటే..