Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ను చంపేందుకు బీజేపీ భారీ కుట్రలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు.
AAP MLA : పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే నరీందర్ కౌర్ ఆ పార్టీ కార్యకర్త అయిన మణ్‌దీప్‌ను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి పటియాలాలోని రోరేవాల్ గ్రామంలోని ఓ గురుద్వారాలో జరిగింది.
Kejriwal: గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా చివరకు గెలిచేది ఆమ్ ఆద్మీ పార్టీనేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
2023 కి ముందే దేశంలో మరో ఫ్రంట్ రాబోతోందా? తెలంగాణ దానికి వేదిక కాబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో వున్నారు. వీరందరి సమావేశానికి ముహూర్తం ఖరారైందా ? అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రాంతీయ పార్టీల భేటీ జరిగే అవకాశం ఉందా ? ప్రాంతీయ పార్టీల సమావేశంకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోందా ? జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్…
ఫిబ్రవరి 10 నుంచి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. యూపీ, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఆప్ పోటీకి సిద్దమైన సంగతి తెలిసిందే. కాగా, ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలని ఆప్ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, కరోనా కారణంగా ఇప్పుడు అంతా సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆప్ చీఫ్ వినూత్నంగా ప్రచారం నిర్వహించడం మొదలుపెట్టారు. Read: యూపీలో…
గోవా బీజేపీలో అసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే నెలలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి తన అభ్యర్థుల జాబితా ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 40 శాసన సభ స్థానాలకు గాను గురువారం 34 అభ్యర్థుల పేర్లు వెల్లడించింది . ఐతే, ఎప్పటి లాగే ఇది కొందరికి రుచించలేదు. దాంతో పార్టీలో అంతర్గత తిరుగుబాటు మొదలైంది. సిట్టింగ్ మినిస్టర్ తో పాటు మాజీ సిఎం కుమారుడు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఒక డిప్యూటీ సీఎం భార్య…
పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని షురూ చేస్తున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ఇక ఆమ్ అద్మీపార్టీ మరో అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎవర్ని నియమించాలి అనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలని అనుకుంది. ఓ మొబైల్‌నెంబర్‌ను క్రియోట్ చేసి ఆ నెంబర్‌కు మిస్డ్ కాల్ లేదా మెజేస్ చేయాలని ఆప్ కోరింది. జనవరి 17 సాయంత్రం వరకు సమయం…
పంజాబ్‌లో ఎలాగైనా పాగా వేయాలని ఆప్ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, రైతు సమస్యలు, బీజేపీకి ఎదురుగాలి, కాంగ్రెస్ నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్ బయటకు వచ్చి కొత్త పార్టీని స్థాపించడంతో రాజకీయంగా కొంత అనిశ్చితి నెలకొన్నది. ఈ అనిశ్చితిని సొంతం చేసుకోవాలని ఆప్ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ పై ప్రత్యేక దృష్టిని సారించిన కేజ్రీవాల్ ఇప్పటికే అనేక వరాలు ప్రకటించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఎవర్ని…
పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు హీటు పుట్టిస్తున్నాయి.. మరోసారి అధికారం మాదే అంటోంది కాంగ్రెస్ పార్టీ.. ఇక, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తమను అధికారాన్ని తెచ్చిపెడతాడని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ.. ఇంకో వైపు.. ప్రజలను ఆకట్టుకునే పనిలో పడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ… ఇప్పటికే పలు ఆకర్షణీయమైన హామీలను కూడా కురిపించారు.. తాజాగా, పంజాబ్ ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) సీఎం అభ్యర్థిని కూడా దాదాపుగా ఖరారు చేశారు అరవింద్ కేజ్రీవాల్.. పంజాబ్ సీఎంగా భగవంత్‌ను…