పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని షురూ చేస్తున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ఇక ఆమ్ అద్మీపార్టీ మరో అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎవర్ని నియమించాలి అనే దానిపై ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలని అనుకుంది. ఓ మొబైల్‌నెంబర్‌ను క్రియోట్ చేసి ఆ నెంబర్‌కు మిస్డ్ కాల్ లేదా మెజేస్ చేయాలని ఆప్ కోరింది. జనవరి 17 సాయంత్రం వరకు సమయం ఇచ్చింది. సుమారు 21 లక్షల మంది ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో సుమారు 93 శాతం మంది భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని కోరారు.
Read: 2వేల ఏళ్ల క్రితమే అందుబాటులో అత్యాధునిక వైద్యం… ఇదే సాక్ష్యం…
3 శాతం మంది పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దుకు అనుకూలంగా కాల్ చేశారని, కొంతమంది ఢిల్లీ సిఎంగా ఉన్న కేజ్రీవాల్‌ను పంజాబ్ నుంచి పోటీ చేయాలని కోరినట్టు ఆప్ ప్రకటించింది. భగవంత్ మాన్ పంజాబ్‌లోని సంగ్రూర్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసి విజయం సాధించారు. భగవంత్ మాన్‌వైపు ప్రజలు మొగ్గు చూపడంతో ఆయన్ను పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్ ఎంపిక చేశారు. ఫిబ్రవరి 14 న ఎన్నికలు జరగాల్సి ఉన్నా, గురుదాస్ జయంతి సందర్భంగా ఎన్నికలను ఫిబ్రవరి 20 వ తేదీకి వాయిదా వేశారు.