ఐదురాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. ముఖ్యంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. మరోవైపు అధికారం తమదగ్గరే వుంచుకునేందుకు కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్న పార్టీలు హామీల జల్లులు కురిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ 10 సూత్రాలతో ‘పంజాబ్ మోడల్’ పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజల ముందుకొచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు 10 సూత్రాలను ఆయన ఓటర్ల ముందుకి…
కరోనా పేషేంట్లలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, ఫిజికల్‌గా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా రెస్పిరేటరీ సిస్టమ్‌పై దాడి చేస్తుంది కాబట్టి మెరుగైన శ్వాసను తీసుకోవడానికి అనుగుణంగా యోగా క్లాసులను నిర్వహించనున్నారు. వ్యాధినిరోదక శక్తిని పెంచే యోగాసనాలు, ప్రాణాయామం వంటి వాటికి సంబంధించిన క్లాసులను నిర్వహించనున్నారు. ఢిల్లీకి యోగశాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారికోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. కరోనా…
దేశంలో కరోనా కేసుల తీవ్ర భయం కలిగిస్తోంది.ఢిల్లీలో 22 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల పెరుగుదల ఢిల్లీ వాసుల్ని కలవరపెడుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, ఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్ నిర్ధరణ అయినవారంతా ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. దేశంలో 4,033 చేరిన ఒమిక్రాన్…
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వైరస్.. భారత్‌లోకి వచ్చే ప్రమాదమున్నందున ప్రభావిత దేశాల నుండి విమానాలను నిలిపివేయాలని ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ మహమ్మారితో ఏడాదిన్నరపాటు పోరాడామని, లక్షలాది మంది కోవిడ్ యోధుల నిస్వార్థ సేవల కారణంగా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అన్నారు. ఒమిక్రాన్ వచ్చిన నేపథ్యంలో యూరోపియన్‌తో సహా అనేక దేశాలు ఈ కొత్త వైరస్ ప్రభావిత దేశాలకు విమాన రాకపోకలను నిలిపేశాయని కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన…
గుజరాత్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా చేసుకొని బీజేపీ ఎత్తులు వేస్తున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ పటేల్ వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆప్ కూడా తన మనుగడ చాటుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. గుజరాత్‌లో పారిశ్రామిక నగరమైన సూరత్‌లో ఆ పార్టీ బలంగా ఉన్నది. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో 20 వార్డులు గెలుచుకొని తన ఉనికిని చాటుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో…
బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నారా ? అనే అనుమానం రాజకీయ వర్గాలతో పాటు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. సోనూసూద్ ఢిల్లీ సీఎంతో భేటీ కావడం ఈ చర్చకు దారి తీసింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో సోనూసూద్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య సమావేశం జరిగింది. సోనూ సూద్, సిఎం కేజ్రీవాల్ భేటీకి రాజకీయ రంగు అద్దుతున్నారు. ఈ సమావేశాన్ని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో ముడిపెట్టి చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.…
సామాన్యుడి పార్టీ పంజాబ్‌పై కన్నేసింది. పంజాబ్ రాష్ట్రానికి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో తన ముద్రను వేసుకోవాలని చూస్తోన్నది ఆప్. ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. గతంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించిన ఆప్, ఇప్పుడు మరో వంద యూనిట్లు పెంచింది. 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ను అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌తో పాటుగా ఉత్తరాఖండ్‌పై కూడా ఆప్ కన్నేసింది. కేజ్రీవాల్…
భారత్‌లో కరోనా సమయంలో తమ కుటుంబాలను, విలువైన ప్రాణాలను పక్కనపెట్టి మహమ్మారిపై ముందు నిలబడి పోరాటం చేశారు. కోట్లాదిమంది ప్రాణాలు కాపాడారు. ఈ పోరాటంలో ఎంతోమంది వైద్యసిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్స్ ప్రాణాలు కోల్పోయారు. కరోనా సమయంలో విలువైన సేవలను అందించిన వైద్యులకు భారతరత్న ఇవ్వాలని ఆప్ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. దేశంలో అత్యున్నత పురస్కారం కరోనా సమయంలో సేవలు అందించిన వైద్యులందరికీ దక్కాలని,…
పంజాబ్ రాష్ట్రానికి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. పంజాబ్‌లో జరిగే ఎన్నికలపై ఆప్ పార్టీ దృష్టిసారించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఛండీగడ్‌లో పర్యటించారు. పార్టీ నాయకులతో చర్చించారు. పంజాబ్ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అని ముందుగా ప్రకటించారు. Read: 60 ఏళ్ళ ‘బాటసారి’ అయితే, నిన్నటి రోజున కేజ్రీవాల్ సడెన్ సప్రైజ్ ఇస్తూ, 200 యూనిట్లు కాదు 300 వరకు కరెంట్…
వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో తన ముద్రవేయాలని అప్ పార్టీ చూస్తున్నది. ఇందులో భాగంగా పంజాబ్‌లో ఆప్ విజయం సాధించి అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించింది. చంఢీగ్ పర్యటనకు ఒకరోజు ముందుగా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో పంజాప్ ఆప్ కేడర్ మరింత ఉత్సాహంగా మారింది. పంజాబ్ లో అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు వినియోగించేవారికి ఉచితంగా విద్యత్…