ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో
త్వరలో కేజ్రీవాల్ ను కూడా జైలులో పెడతారు అంటూ ఆయన జోస్యం చెప్పుకొచ్చారు. స్థానిక పార్టీలను సైతం బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ తో అలయెన్స్ లో ఉన్న వారిని కమలం పార్టీ ఇబ్బందులు పెడుతుందని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
బీహార్‌లో నితీష్‌కుమార్ సారథ్యంలో బీజేపీ-జేడీయూ కూటమి ఆదివారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్, ఆర్జేడీ, లెప్ట్‌పార్టీల కూటమి నుంచి బయటకు వచ్చి కమలం పార్టీతో మద్దతు మరోసారి నితీష్‌కుమార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఈ సందర్భంగా నితీష్ తీరుపై ఇండియా కూటమిలోని పలు పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఆయన తీరును తీవ్రంగా ఖండించాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. బటిండాలో పంజాబ్ ప్రభుత్వం రూ.1125 కోట్ల విలువైన పథకాల శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 13 సీట్లను ఆప్ కు ఇవ్వాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పనిని చూసి పంజాబ్‌లో తమకు ఓటేశారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. వచ్చేసారి 117 సీట్లలో 110కి పైగా ఆమ్ ఆది పార్టీకి సీట్లు వస్తాయని తన…
విషపూరిత పొగమంచుతో దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత ఈరోజు కూడా తీవ్రంగా ఉంది. సోమవారం ఉదయం 9 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 437గా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకటించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కాలుష్యాన్ని నివారించేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశ పురోగతికి బీజేపీ ఒక్క పని కూడా చేయలేదని అన్నారు. అంతేకాకుండా.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా భారత్ కూటమిని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. నేడు దేశం మూడు సమస్యలను ఎదుర్కొంటోందని కేజ్రీవాల్ అన్నారు. అందులో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి ఉన్నాయని తెలిపారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం నగర పాలక సంస్థకు కొన్ని అధికారాలను తొలగిస్తున్నదని విమర్శించారు. అయితే ఇప్పటికీ తమకు ఉన్న అధికారంతో విద్యుత్, నీరు, విద్యను అందించడం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు కేజ్రీవాల్. breaking news, latest news, telugu news, big news, kejriwal
ఢిల్లీలోని జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు ఇప్పుడు ఉచిత చక్కెర లభించనుంది. సోమవారం కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చైనా అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. గత 9 ఏళ్లుగా చైనా భారత్‌పై కన్నేసిందని.. అయితే ప్రధాని పూర్తిగా మౌనంగా ఉన్నారని విమర్శించారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. భారతదేశం "విశ్వగురువు"గా మారాలంటే ప్రజలు సామరస్యంగా జీవించాలని.. మంచి విద్య, వైద్య సదుపాయాలు మరియు నిరంతర విద్యుత్ సరఫరాకు హామీ ఇవ్వాలని ఆయన అన్నారు.