ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం నగర పాలక సంస్థకు కొన్ని అధికారాలను తొలగిస్తున్నదని విమర్శించారు. అయితే ఇప్పటికీ తమకు ఉన్న అధికారంతో విద్యుత్, నీరు, విద్యను అందించడం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు కేజ్రీవాల్. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. తమ పనిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్ల తమ ప్రభుత్వం సవాలక్ష పరిస్థితుల్లో పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసేందుకు వీలుగా ఢిల్లీలోని అన్ని అధికారాలను ముఖ్యమంత్రి, మంత్రులతో సహా ఎన్నికైన ప్రభుత్వానికి అప్పగించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిందని కూడా ఆయన చెప్పారు.
Also Read : Uttarpradesh: మహిళా ఎస్సైతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. అరెస్టు
అయితే, దీన్ని మార్చి వారం రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.”కేంద్రంతో పోరాటం చేయాలనే ఉద్దేశ్యం మాకు లేదు ,కానీ మనకు ఏ శక్తి ఉన్నా, దేవుడు మనకు ప్రసాదించిన శక్తి ఏదైనా సరిపోతుంది. నేను ఒకప్పుడు ఈ దేశంలో తెలియని సాధారణ మనిషిని. ఇది మీ ప్రేమ మరియు ఆశీర్వాదం. నాకు ఈ ముఖ్యమైన బాధ్యత (సీఎం కావడం) ఇచ్చిన దేవుడు” అని కేజ్రీవాల్ అన్నారు. కేంద్రంతో వివాదానికి బదులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించామని, దాని నిర్ణయం కోసం వేచి చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈలోగా, ఆప్ ఇప్పటికీ తమ వద్ద ఉన్న అధికారంతో ప్రజల కోసం పని చేస్తూనే ఉంటుంది, అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు
Also Read : Haryana : అమానుషం..కుటుంబ సభ్యుల ముందే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం..