బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడింది.. బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడిందన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం మాట్లాడుతూ.. ఎన్టీపీసీలో చవకగా వచ్చే విద్యుత్తును కాదని కమీషన్ కోసమే ఇతర సంస్థల నుంచి బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. గతంలో బీఅర్ఎస్ విద్యుత్ అవినీతిపై రేవంత్ ఆరోపణలు చేశాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టాక రేవంత్ ఎందుకు స్పందించడం లేదని, ఎన్టీపీసీ తో ppl కుదుర్చుకోవడానికి కాంగ్రెస్…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తున్నదని ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్ మరియు బిఆర్ ఎస్ ఎంఎల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు.…
ప్రయాణికులకు ఢిల్లీ మెట్రో అధికారులు కీలక ప్రకటన చేసింది. మార్చి 25న అనగా హోలీ పండుగ రోజు మెట్రో రైలు ప్రయాణ సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్ర ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్ట్ ను ఖండించారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం రాజకీయ కక్షలో భాగమేనని ఆరోపించారు. గుజరాత్ లో నేరాలు చేసిన వారిని మాత్రం నిర్దోషులుగా క్షమాభిక్ష పెడుతున్నారని.. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరగడం శోచనీయం అని పేర్కొన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు ఆప్ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు కూడా సీఎం ఇంటికి చేరుకుంటున్నారు.
యర్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ న్యాయవాది కేవీ రమణ.. గన్నవరంలో ప్రముఖ న్యాయవాది కేవీ రమణ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలోకి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి యార్లగడ్డ వెంకట్రావ్ సమక్షంలో తెలుగు దేశం పార్టీలో న్యాయవాది కేవీ రమణ జాయిన్ అయ్యారు. అంతకు ముందు వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే టీడీపీ-…
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఇండియా కూటమి నేతలు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్‌లపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.