ప్రయాణికులకు ఢిల్లీ మెట్రో అధికారులు కీలక ప్రకటన చేసింది. మార్చి 25న అనగా హోలీ పండుగ రోజు మెట్రో రైలు ప్రయాణ సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది. హోలీ నేపథ్యంలో సోమవారం అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకు మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపింది.
హోలీ పండుగ కోసమే టైమింగ్స్ మార్చినట్లు అధికారులు వెల్లడించారు. సమయ మార్పులను ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 25న మధ్యాహ్నం 2:30 గంటలకు మెట్రో రైళ్లు సేవలు ప్రారంభమవుతాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రయాణికులకు సూచించింది. ర్యాపిడ్ మెట్రో/ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌తో సహా అన్ని లైన్లలో నిర్ణీత సమయానికి ముందు ఎలాంటి సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత యథావిథిగా అన్ని సేవలు పున:ప్రారంభమవుతాయని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Gorantla Butchaiah Chowdary: విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ పై సమగ్రవిచారణ జరపాలి..
ఇదిలా ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను గురువారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆప్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా.. ఎలాంటి దాడులు జరగకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇక పోలీసుల సూచన మేరకు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు స్టేషన్లు మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో అధికారులు వెల్లడించారు.
METRO TRAIN SERVICES TO START AT 2:30 PM ON HOLI
On the day of the ‘Holi festival, i.e. 25th March, 2024 (Monday), Metro services will NOT be available till 2:30 PM on all Lines of the Delhi Metro including Rapid Metro/Airport Express Line.
— Delhi Metro Rail Corporation (@OfficialDMRC) March 22, 2024