యర్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ న్యాయవాది కేవీ రమణ..
గన్నవరంలో ప్రముఖ న్యాయవాది కేవీ రమణ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలోకి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి యార్లగడ్డ వెంకట్రావ్ సమక్షంలో తెలుగు దేశం పార్టీలో న్యాయవాది కేవీ రమణ జాయిన్ అయ్యారు. అంతకు ముందు వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే టీడీపీ- జనసేన కలిసి పని చేయాలని యార్లగడ్డ పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లోకి ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్స్ తగులున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ నేతలంతా వరుసగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ జాయిన్ కాగా, ఇవాళ (గురువారం) ముథోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి హస్తం గూటికి చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి సీతక్క విఠల్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది.
టీడీపీ-జనసేన-బీజేపీపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.. దీంతో.. అన్ని పార్టీలో ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెడుతున్నాయి.. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో దూసుకుపోతోంది.. సిద్ధం సభలతో మరింత హీట్ పెంచుతోంది.. అయితే, 55 రోజుల ఎన్నికల ప్రచార ప్రణాళిక అమలుపై ఉత్తరాంధ్ర ఎమ్మేల్యేలు, అభ్యర్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.. ఎన్నికల ప్రచారంగా మరోసారి గడపడప విస్తృతంగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు..
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. వైసీపీకి రాజీనామా చేయాలని బెదిరించారని ఫిర్యాదు చేశారు కౌన్సిలర్ వెంకటలక్ష్మి. కొద్ది నెలలుగా మూడో వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మి, ఆమె భర్త రామాంజనేయ రెడ్డి ఎమ్మెల్యేకు దూరంగా ఉంటున్నారు. గత నెల 19న ప్రచారం కోసం ప్రొద్దుటూరులోని మూడో వార్డుకు ఎమ్మెల్యే రాచమల్లు వెళ్లారు. వైసీపీకి రాజీనామా చేయకుంటే అంతుచూస్తానని ఎమ్మెల్యే బెదిరించినట్లు కౌన్సిలర్ వెంకటలక్ష్మి వాపోయారు.
రైతుబంధు 5 ఎకరాల వరకు ఇవాళ రేపు పూర్తి చేస్తాం
రైతుబంధు 5 ఎకరాలవరకు ఇవాళ రేపు పూర్తి చేస్తామని, ధరణిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోదండ రెడ్డి చెప్పిన దానికంటే ఎక్కువ అక్రమాలు ఉన్నాయని, నా దగ్గర ధరణికి చెంది మరింత సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. అన్ని వివరాలతో బైట పెడతామని, మేము అధికారం చేపట్టిన రెండుమూడు రోజుల్లో power shut down చెయ్యాలని ప్లాన్ ఉండిందన్నారు మంత్రి పొంగులేటి. దానిని మేము అధికమించాం …ఆ పరిస్థితులనుంచి బైట పడ్డామని, తాగునీటి సమస్య రానీకుండా చూస్తామన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తో చర్చించండి ….అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
బీజేపీకి షాక్.. రాజకీయాల గుడ్ బై చెప్పిన మాజీ సీఏం..
లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ డీవీ సదానంద గౌడ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. బెంగళూర్ నార్త్ సీటు నుంచి వేరే అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన కలత చెందానని, దీంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సదానంద గౌడ గురువారం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజేని బీజేపీ బరిలోకి దింపింది. ప్రస్తుతం శోభ ఉడిపి చిక్ మగళూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా ఉంది.
దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్‌గిరి
మల్కాజ్‌గిరి పార్లమెంట్ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేను సీఎంగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఆ గొప్పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులదన్నారు. ఆనాడు నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి నన్ను ఢిల్లీకి పంపించారన్నారు. 2,964 బూత్ లలో ప్రతీ బూత్ లో ఒక సైనికుడిలా కార్యకర్తలు పనిచేశారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి అని, నాటి మల్కాజిగిరి గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ పతనం 2019 మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైందని, వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామని ఆయన వ్యాఖ్యానించారు.
అనుములకి ఎనుములకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు
బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అనుములకి ఎనుములకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్రపురి సొసైటీలో జరిగిన అవినీతికి సీఎం రేవంత్ రెడ్డికి ఏంటి సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడైనా రేవంత్ సోదరులో మహేంద్ర రెడ్డి అనే పేరు విన్నారా..? అని ఆయన ప్రశ్నించారు. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రభుత్వానికి ఇవ్వండి తప్పకుండా వారిపై మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నిజంగా తప్పు చేస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదన్నారు. కానీ అనవసరంగా కావాలని ఆరోపణలు చేస్తే చూస్తూ ఉరుకోమని, బీఆర్ఎస్ కి చిత్తశుద్ధి ఉంటే మిరే కదా గతంలో ప్రభుత్వం ఉంది మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అని ఆయన మండిపడ్డారు.
ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
ఉదయగిరి ఆత్మీయ సమావేశంలో ఉదయగిరి తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి.. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తానని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఈ సమావేశం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ బయన్న అధ్యక్షతన జరిగింది.
కేజ్రీవాల్ అరెస్ట్ కాకుండా అడ్డుకోలేం: ఢిల్లీ హైకోర్ట్
ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్లకు సంబంధించి బలవంతపు చర్య నుండి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు ఈరోజు నిరాకరించింది. తాను ఈడీ విచారణకు హాజరవుతాను కానీ, తనను అరెస్ట్ చేయబోమని ఈడీ నుంచి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను ఈడీ జారీ చేసిన సమన్ల ప్రకారం విచారణకు వెళ్తే ఎలాంటి బలవంతపు చర్యను తీసుకోవద్దని కోర్టు ముందు హామీ ఇవ్వాలని కోరారు. ఈ రోజు పిటిషన్ విచారించిన ఢిల్లీ హైకోర్టు, మధ్యంతర ఉపశమనం ఇవ్వడానికి తాము మొగ్గు చూపడం లేదని పేర్కొంది. ఈ మధ్యంతర పిటిషన్‌పై ఈడీ నుంచి ప్రతిస్పందన కోరుతూ.. ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.