ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు (Kejriwal) మరోసారి ఈడీ నోటీసు జారీ చేసింది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఆయనకు ఏడుసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సమన్లు జారీ చేశారు. కానీ ఇప్పటి వరకు మాత్రం కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. తాజాగా మంగళవారం కూడా ఎనిమిదో సారి ఈడీ అధికారులు సమన్లు అందజేశారు.
ఇదిలా ఉండగా.. ఈడీ ఇప్పటి వరకు ఏడుసార్లు కేజ్రీవాల్‌కు సమన్లు పంపించింది. ఇటీవల ఫిబ్రవరి 22వ తేదీన, గతంలో నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ.. నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. దీంతో జనవరి 31, ఫిబ్రవరి 14వ తేదీన కూడా ఈడీ నోటీసులు పంపింది. అయితే, అప్పుడు కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. తాజాగా మంగళవారం మరోసారి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈసారైనా హాజరవుతారా? లేదా? తేలాల్సి ఉంది.
ఇకపోతే సార్వత్రిక ఎన్నికల ముందు ఆప్‌ను వేధించడానికే ఈడీని అడ్డంపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తు్న్నారు. అలాగే సీబీఐ ద్వారా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందని ఇటీవల ఆప్ మంత్రులు విమర్శించారు.
The Enforcement Directorate has issued 8th summon to Delhi CM and AAP national convenor Arvind Kejriwal asking him to appear on March 4.
(file pic) pic.twitter.com/5jHYn4oDD6
— ANI (@ANI) February 27, 2024