ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్ర ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అరెస్ట్ ను ఖండించారు. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం రాజకీయ కక్షలో భాగమేనని ఆరోపించారు. గుజరాత్ లో నేరాలు చేసిన వారిని మాత్రం నిర్దోషులుగా క్షమాభిక్ష పెడుతున్నారని.. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరగడం శోచనీయం అని పేర్కొన్నారు.
Read Also: IPL 2024: జడేజా కెప్టెన్‌గా ఎందుకు ఫ్లాప్ అయ్యాడు?.. కారణం చెప్పిన కోచ్!
తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో.. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఉద్యమ ఆకాంక్షలు, విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ కర్తవ్యాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్తో కలిసి కోదండరామ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు అంతర్జాతీయ స్థాయిలో విద్య ప్రమాణాలు తీర్చిదిద్దాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉందని కోదండరాం అన్నారు.
Read Also: IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో సరికొత్త నిబంధనలు..
అధ్యాపకులు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని, అన్ని యూనివర్సిటీలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య వ్యవస్థను బలోపేతం చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని.. తెలంగాణ వస్తే విద్య రంగం అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారని తెలిపారు. ఆ దిశలో గత ప్రభుత్వం అడుగులు వేయలేదని విమర్శించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య నినాదానికే పరిమితం అయిందని ఆరోపించారు. విద్యను బలోపేతం చేసుకోడానికి విద్యార్థి సంఘాలు, మేధావులు సంఘటితం కావాలని ఆయన కోరారు.