స్కూల్ ఫీజుల పెంపును ఏ మాత్రం సహించబోమని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హెచ్చరించారు. ఫీజుల పెంపును నిరసిస్తూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో మోడల్ టౌన్‌లోని క్వీన్ మేరీ స్కూ్ల్ యాజమాన్యం పిల్లల్ని వేధించడం ప్రారంభించింది. అంతేకాకుండా స్కూల్ నుంచి బహిష్కరించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఎక్స్ ద్వారా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా మండిపడ్డారు. ఫీజుల పెంపును సహించబోమన్నారు. పాఠశాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏ యాజమాన్యం అక్రమంగా ఫీజులు వసూలు చేసినా ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: ఢిల్లీలో మూడ్రోజులు ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది..
ఫీజుల పెంపునకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయని చెప్పారు. నిబంధనలు పాటించకుండా ఫీజులు పెంచితే తర్వాత బాధపడాల్సి ఉంటుందని తెలిపారు. ఫిర్యాదులు అందగానే పాఠశాలలకు నోటీసులు పంపిస్తామని రేఖా గుప్తా మీడియాతో అన్నారు. పిల్లల హక్కులను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఏ విధమైన దోపిడీ, అన్యాయాలను జీరో టాలరెన్స్ విధానంతో పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి బిడ్డకు న్యాయం, గౌరవం, నాణ్యమైన విద్య లభించాలని కోరారు.
ఫీజుల పెంపుపై ప్రతిపక్ష పార్టీ ఆప్ ఆరోపించింది. అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు భరత్ అరోరాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని.. ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారని ఆరోపించారు. అందుకే ప్రైవేటు స్కూళ్లు ఫీజులు పంచేశాయని ధ్వజమెత్తింది. బీజేపీ ప్రభుత్వం రాగానే ఫీజులు పెంచేశారని మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Film Updates : విషు పండుగ కానుకగా తమిళ్, మలయాళ సినిమాల స్పెషల్ అప్డేట్స్
ఆప్ ఆరోపణలను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఖండించారు. అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, మాజీ ముఖ్యమంత్రి అతిషి సోషల్ మీడియాలో అబద్ధాలు, గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్నారని వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళా శ్రేయస్సు పథకం, ఆయుష్మాన్ భారత్, విద్యుత్ కోతలు వంటి అంశాలపై వారి ప్రచారం విఫలమైంది.. తాజాగా రాజకీయ మైలేజ్ కోసం పాఠశాల ఫీజుల పెంపు అంశాన్ని చేపట్టారని.. కానీ వారు విజయం సాధించలేరు.’’ అని సచ్‌దేవా పేర్కొ్న్నారు.
आज जनसंवाद कार्यक्रम के दौरान क्वीन मैरी स्कूल, मॉडल टाउन से संबंधित एक मामला सामने आया, जिसमें बच्चों के परिजनों ने गलत तरीके से फीस वसूली और बच्चों को स्कूल से निकाले जाने की शिकायत दर्ज की।
इस विषय पर तुरंत संज्ञान लेते हुए संबंधित अधिकारियों को तत्काल जांच कर कड़ी और आवश्यक… pic.twitter.com/gVThK6jFTn
— Rekha Gupta (@gupta_rekha) April 15, 2025