దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం అమానుష ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై ఓ వృద్ధ న్యాయవాది రాకేశ్ కిషోర్(71) ఊహించని రీతిలో షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అడ్డుకుని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ పదే పదే నినాదాలు చేశాడు. సనాతన ధర్మానాన్ని అవమానిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ పరిణామంతో కోర్టు ప్రాంగణం అవాక్కైంది. ఇక ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని.. యథావిధిగా కార్యక్రమాలను గవాయ్ కొనసాగించారు.
ఇక గవాయ్‌పై దాడి యత్నాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఫోన్ చేసి ఖండించారు. ఇలాంటి దాడులను సహించబోమని మోడీ పేర్కొన్నారు. అలాగే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలు పార్టీల నేతలు ఖండించారు.
ఇది కూడా చదవండి: Tragedy: హలో బేబీ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను.. భార్య ప్రియుడితో ఫోన్ మాట్లాడుతుండగా..
తాజాగా ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. భారత ఆత్మపై దాడిగా అభివర్ణించారు. సీజేఐ బీఆర్ గవాయ్‌పై దాడిని ఖండించారు. గవాయ్‌పై బూటు విసిరే ప్రయత్నం కేవలం ఒక న్యాయమూర్తిపై జరిగిన దాడి మాత్రమే కాదని.. భారతదేశ ఆత్మపై జరిగిన దాడి.. ఈ దేశ న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా కేజ్రీవాల్ అభివర్ణించారు. ‘‘ఒక దళిత కుమారుడు కష్టపడి పనిచేసి.. నిజాయితీ ద్వారా దేశంలో అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. దీనిని కొందరు సహించలేకపోతున్నారు. నిందితుడి మద్దతుదారులు సీజేఐను బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఈ దేశం ఈ రకమైన రాజకీయాలను ఎప్పటికీ సహించదు.’’ అని ఎక్స్‌లో కేజ్రీవాల్ రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Israel-Gaza War: నేటితో గాజా-ఇజ్రాయెల్ వార్ రెండేళ్లు పూర్తి.. కొలిక్కిరాని ట్రంప్ శాంతి చర్చలు
ఇదిలా ఉంటే నిందితుడు రాకేష్ కిషోర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు విడిచిపెట్టేశారు. 3 గంటల పాటు విచారించి వదిలిపెట్టేశారు. రాకేష్ కిషోర్ కోర్టు నంబర్- 1లోకి ప్రవేశించి గవాయ్ నేతృత్వంలోని బెంచ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని బయటకు తీసుకెళ్లారు. దాడి సమయంలో ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేగా హిందుస్థాన్’’ అని నినాదాలు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని జవారీ ఆలయంలో ఏడు అడుగుల పొడవున్న విష్ణువు విగ్రహం శిరచ్ఛేదం చేయబడిన నిర్మాణాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ సీజేఐ గవాయ్ నిర్ణయం తీసుకోవడంపై నిందితుడు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.