Manish Sisodia: మనీష్ సిసోడియాకు ప్రమోషన్.. పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా నియామకం
- మనీష్ సిసోడియాకు ప్రమోషన్
- పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో సంస్థాగత మార్పులకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ఆప్ అధినేత కేజ్రీవాల్ నేతృత్వంలో పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురి సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మనీషి సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ లాంటి నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ ఆప్ విభాగానికి సౌరబ్ భరద్వాజ్, పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా మనీషి సిసోడియాను నియమించారు. సౌరబ్ భరద్వాజ్.. గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మె్ల్యేగా గెలిచారు. అలాగే రెండు సంవత్సరాలు ఢిల్లీ ఆరోగ్య మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీ యూనిట్ అధ్యక్షుడిగా సౌరభ్ భరద్వాజ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ఇది కూడా చదవండి: Kriti Sanon : ప్రేమ కోసం ప్రాణం ఇచ్చే అమ్మాయిలు కూడా ఉన్నారు..
మొత్తం నాలుగు రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించినట్లు పార్టీ ప్రకటించింది. ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధ్యక్షుడిగా మహారాజ్ మాలిక్‌ను నియమించింది. సీనియర్ నాయకులు గోపాల్ రాయ్, దుర్గేష్ పాఠక్‌లను వరుసగా గుజరాత్ ఇన్‌చార్జ్ మరియు సహ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. పంకజ్ గుప్తాను గోవా ఆప్ ఇన్‌చార్జ్‌గా నియమించింది. మనీష్ సిసోడియాను పంజాబ్ ఇన్‌చార్జ్‌గా, సతేంద్ర జైన్‌ను కో-ఇన్‌చార్జ్‌గా నియమించారు. రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాను మాత్రం రాష్ట్ర కో-ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం పంజాబ్‌లోనే ఆప్ అధికారంలో ఉంది. ఇక పంజాబ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌ను ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా నియమించారు.
ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక అతిషికి ప్రతిపక్ష హోదా దక్కింది.
ఇది కూడా చదవండి: Betting Apps : బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సంచలనన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?