Kadiyam Srihari: ఇవాళ అనుచరులతో కడియం భేటీ అయ్యారు. పార్టీ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ నిర్వహించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని సమాచారం.
అనంతపురం అర్బన్ టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. అనంతపురం అర్బన్ టీడీపీలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టిక్కెట్‌ను దగ్గుబాటి ప్రసాద్‌కు కేటాయించగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు టికెట్ కేటాయించలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. డబ్బులకు టికెట్లు…
బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతుండటంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారే వారు పవర్ బ్రోకర్లని హరీష్ వ్యాఖ్యానించారు. కొంత మంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపోతున్నారని అన్నారు.
బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో కడియం కావ్య తెలిపారు.
Vivek Venkatswamy: తెలంగాణ ఏర్పాటుతో కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లాభ పడిందిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కలిసారు.
తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం పడిపోతుందని కలలో కూడా ఊహించలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ఎట్లుంటదో జనాలకు అర్థం అయ్యింది.. ఈ ప్రభుత్వంపై గ్రామాల్లో మన్నువోసుడు, దుమ్మువోసుడే కనిపిస్తుంది. అయితే, మల్కాజ్ గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి ఒక్కడే లోకల్.. ఇద్దరు నాన్ లోకలే అని ఆయన చెప్పుకొచ్చారు.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డిపైన ఆయన ఘాటైన కామెంట్స్ చేశారు.
కేసీఆర్ గొప్ప నాయకుడని ఆయన పక్కన ఉన్న వాళ్లే కేసీఆర్ ను బ్రష్టు పట్టించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ కి వెళ్తానని దానం అన్నారు. తన అభ్యర్థిత్వం పై కేటీఆర్ న్యాయస్థానానికి వెళితే తాను న్యాయస్థానంలోనే సమాధానం చెప్తానని అన్నారు. వాళ్లు చేసింది సభబైతే ఇప్పుడు జరుగుతున్నది సబబేనని అన్నారు. ముఖ్యమంత్రిపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని మూడు నెలల్లో ముఖ్యమంత్రి 3500 కోట్లు సంపాదిస్తే పది సంవత్సరాల…