KCR: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాష్ట్రంలోని జాతీయ పార్టీల నేతలతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు.
KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు కరీంనగర్ లో పర్యటించనున్నారు. సాయంత్రం నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. గులాబీ దళపతి హైదరాబాద్ నుండి రాజీవ్ రహదారి మీదుగా వచ్చి నగరంలోని బైపాస్ రోడ్డు మీదుగా రాంనగర్ చౌరస్తాకు చేరుకుంటారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిందని, ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏవి అమలు కాలేదన్నారు బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ ఆయన మెదక్‌లో మాట్లాడుతూ.. రైతు బంధు వచ్చిందా..? రుణమాఫీ అయ్యిందా..? కరెంట్ సరిగా వస్తుందా..? అని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు సరిగా వచ్చినటువంటి కరెంట్ ఎక్కడికి పోయింది..? అని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు…ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికుల పొట్ట కొట్టారని, ఐదు నెలల్లో…
ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం రామంతపూర్ లో సబ్బండ వర్గాల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, వివిధ సంఘాల నేతలు కృష్ణయ్య సాయికిరణ్ పాండు శ్రీవాణి వెంకట్రావు గోపాల్ మల్లేష్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇన్ని వర్గాల మద్దతు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కులాలతో మతాలతో పార్టీలతో ప్రాంతాలతో జెండాలతో సంబంధం…
సిద్దిపేట జిల్లా బీజేపి కార్యాలయంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. నిన్న కేసీఆర్ తనపై మాట్లాడిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. రఘునందన్ రావు దుబ్బాక లో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డి లో ఓడిపోలేదా అని ఆయన ప్రశ్నించారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినా కేసీఆర్ కి సిగ్గు ఉండాలని, వెంకట్రామిరెడ్డి ఎన్ని కోట్లు ఇస్తే కేసీఆర్ మెదక్ సీటు ఇచ్చాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్…
Komatireddy: కేసీఆర్ గురించి మాట్లాడటమే వేస్ట్.. రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కి ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పులేదన్నారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో కేసీఆర్ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వర్షం కురిసిన ఇంతమంది వచ్చారు మీకందరికీ ధన్యవాదాలు తెలిపారు. చైతన్యవంతమైన మెదక్ లో మీరు మంచి తీర్పు ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటిలతో అరచేతిలో వైకుంఠం చూపించిందన్నారు. అనేక వాగ్దానాలు చేసి అబద్దాలతో అధికారంలోకి వచ్చారని ఆయన తెలిపారు. ఉచిత బస్సుతో మహిళలు కోటుకుంటున్నారు…ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, రైతు బంధు డబ్బులు అందరికి వచ్చాయా..పాత పథకాలు కూడా సరిగా అమలు…
ఈ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లు గెలడమే మా టార్గెట్ అన్నారు. 100 రోజుల పాలనను చూసి తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39. 50 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ లోక్ సభ ఎన్నికల్లో మా ఓట్ షేర్ పెరిగిన లేదా తగ్గకున్నా మేం పాసైనట్లే.. రెఫరెండం అంటే అదీ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కిషన్ రెడ్డి చెప్పినట్లు రూ. 10 వేల కోట్లను.. ఏ శాఖకు, ఎన్ని నిధులు, ఏ ప్రాజెక్టులకు ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం శ్వేత పత్నం విడుదల చేయాలి.. నిధుల శ్వేతపత్రంపై అమరవీరుల స్థూపం దగ్గరకు కిషన్ రెడ్డితో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
కేసీఆర్ ప్రభుత్వం దిగిపోతూ 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ అప్పుకు దాదాపు 30వేల కోట్ల రూపాయల మిత్తిని చెల్లించామన్నారు.