CPI Narayana: ప్రతిపక్షంలో కూర్చున్నా.. కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana Slams KCR: ప్రతి క్షంలో కూర్చున్నా కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆరు నెలలు కేబినెట్ ప్రకటించని సీఎం దేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరని ఎద్దేవా చేశారు. అహంభావంతో కేసీఆర్ పరిపాలన చేశాశారని, అందుకే ఈ సారి ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారన్నారు. గతంలో జరిగిన తప్పులను గుర్తించి.. తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి పని చేయాలని నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నారాయణ నివాళులర్పించారు.
గన్ పార్క్ వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ… ‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఎంతో మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల వల్లే తెలంగాణ వచ్చింది. ఒక్కరో ఇద్దరో కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాలేదు. ఎంతో మంది అమరవీరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది. ప్రజల మనోభావాలు ఉన్నా కూడా తెలంగాణ పేటేట్ రైట్స్ మొత్తం కేసీఆర్‌కే పోయింది. తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి పదేళ్లు కేసీఆర్ పాలించారు. సరైన పద్ధతిలో కేసీఆర్ పరిపాలన అందించలేకపోయారు. నీరు, విధులు, నియామకాలు అందించడంలో విఫలమయ్యారు. తెలంగాణను అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్.. తన కుటుంబ సభ్యులను మాత్రం బాగానే అభివృద్ధి చేసుకున్నారు’ అని అన్నారు.
Also Read
- Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో అమెరికా ఆల్‌టైమ్ రికార్డు.. టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు!
‘కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం పరాకాష్ట. ప్రతి పక్షంలో కూర్చున్నా కూడా కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆరు నెలలు కేబినెట్ ప్రకటించని సీఎం దేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఆ ఆరు నెలలు ఫామ్ హౌస్‌లో పడుకుని కేబినెట్ ఏర్పాటు చేయలేదు. అహంభావంతో కేసీఆర్ పరిపాలన చేశారు. అందుకే ఈసారి ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి ఉత్సాహవంతులు. కేంద్ర పార్టీ సపోర్ట్ కూడా ఆయనకు ఉంది. గతంలో జరిగిన తప్పులను గుర్తించి తెలంగాణ అభివృద్ధి కోసం రేవంత్ పని చేయాలి. అనవసరమైన గిల్లి కజ్జాలు పెట్టుకుంటే టైం వేస్ట్ తప్ప.. ఉపయోగం ఉండదని రేవంత్ గమనించాలి. అభివృద్ధిలో ఒక్కడివే కాకుండా అందరినీ కలుపుకుని పోవాలి. అందరినీ కలుపుకుని పోతేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అందుకు కమ్యూనిస్టు పార్టీ కూడా సహకరిస్తుంది’ అని నారాయణ తెలిపారు.
తాజావార్తలు
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!