అధికారంలో ఉన్నప్పుడు ఆ అవసరం రాలేదు. ప్రతిపక్షంలోకి వచ్చాక అక్కెరకొచ్చింది. అందుకే సెట్ చేసే పనిలో పడ్డారు. రండి బాబూ రండి.. కార్యకర్తలను ఉత్తేజపరిచే పనిలో పడ్డారట. దసరా తర్వాత గులాబీశిబిరంలో పందేరమే అంటున్నారు. డిసెంబర్లో గులాబీ బాస్ ఫాంహౌజ్ వీడుతారని చెబుతున్నారు! కాంగ్రెస్ ప్రభుత్వానికి యేడాది టైం ఇచ్చిన తర్వాత ఎటాక్ చేద్దామనే వ్యూహంలో బీఆర్ఎస్ ఉందట! ఆ క్రమంలోనే పార్టీ రూట్ లెవల్లో సెట్ చేద్దామనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడాని ఎదురు…
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను విజయ దశమి మనకు తెలియజేస్తుందని కేసీఆర్ తెలిపారు. దసరా నాడు శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, షమీ వృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంలా భావించి పెద్దలకు సమర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవడం, గొప్ప భారతీయ సాంస్కృతిక ఆచారమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ…
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతిపట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని పేర్కొన్నారు. సమాజ హితుడుగా వారి తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని అన్నారు. రేపటి తరాల ఉజ్వల భబిష్యత్తుకోసం జీవితకాలం తపించిన రతన్ టాటా ఆదర్శాలు, కార్యాచరణ ప్రపంచ ఆర్థిక పారిశ్రామిక రంగానికి దిక్సూచిగా…
ఏమాటకామాటే! గత పదేళ్లుగా గజ్వేల్ అంటే గజ్వేలే! ఎక్కడా తగ్గేదే అన్నట్టుగా ఉండేది! కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సొంత ఇలాఖా ఆమాత్రం ఉండొద్దా! మరి ఇప్పుడు ఆ జిగేల్ ఏమైంది? కేసీఆర్ ఎక్కడున్నారు? ఇదే అంశాన్ని కాంగ్రెస్ అస్త్రంగా మలుచుకుంది! కేసీఆర్ కనిపించడం లేదంటూ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చింది! దీనికి కౌంటర్గా బీఆర్ఎస్ ఏం చేసింది? ఛలో చూద్దాం రండి! గజ్వేల్ నియోజకవర్గం. దీనికి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మాజీ సీఎం కేసీఆర్ ఇలాఖా!…
CM Revanth Reddy: కేటీఆర్..హరీష్ రావు..సెక్రటేరియట్ రండి అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. గత ప్రభుత్వం చేసింది రెండే రెండు అన్నారు. ఒకటి తప్పులు..రెండోది అప్పులు అన్నారు....
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. బతుకమ్మ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తర తరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు…
Harish Rao: పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి పేదల ఆశీస్సులు ఉండాలని, వారి గోసలు ఉండకూడదని తెలిపారు.
తెలంగాణ రైతాంగ పోరాట యోధ, ఆత్మగౌరవ ప్రతీక, వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి ( సెప్టెంబర్ 26) సందర్భంగా వారందించిన పోరాట స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అణిచివేతకు గురైన బలహీన వర్గాల తిరుగుబాటు తత్వానికి, ప్రతిఘటనా పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తిగా నిలిచారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, అస్థిత్వ ఉద్యమంలో, స్వయం పాలన కోసం కొనసాగిన పోరాటంలో, పెద్ద ఎత్తున బహుజనులు భాగస్వామ్యం కావడం వెనక నాటి వారి పోరాట…
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకు బయటికి ఎక్కువగా రావడం లేదు? ఎన్నికల తర్వాత అడపా దడపా మాత్రమే కనిపించడం వెనకున్న అసలు రీజనేంటి? బయట జరుగుతున్న రకరకాల చర్చలకు మించిన మాస్టర్ ప్లాన్ ఉందా? నన్ను ఓడిస్తే... వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని గతంలో అన్న మాటల్ని నిజం చేస్తున్నారా? లేక సమయం ఉంది మిత్రమా.... అంత తొందరేల అంటున్నారా? అసలేం జరుగుతోంది?
మెదక్ జిల్లా నర్సాపూర్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్లు ఇవ్వాలో రేపో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అన్నారు. వాళ్ళని ఏమి అనవద్దు.. వాళ్ళు కూడా మనవాళ్లే అని వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా అరికెపుడి గాంధీ తనకు ఇష్టం అని తెలిపారు. రూ. 10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కోనుగోలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ది అని దుయ్యబట్టారు.