తెలంగాణ గుర్తింపు, ఆత్మగౌరవం కోసం పాటుపడిన తొలి తరం నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు . ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు మద్దతుగా తన మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ ఆశయ సాధన పట్ల అంకితభావంతో ఉన్నారని కొనియాడారు. పూర్వపు ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ వ్యతిరేక శక్తుల ఒత్తిడి ఉన్నప్పటికీ, బాపూజీ తన జలదృశ్యం నివాసాన్ని తెలంగాణ ఉద్యమానికి వేదికగా ఎలా ఇచ్చారో…
బీఆర్ఎస్ అధిష్టానానికి జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నాయా? దెబ్బ ఎక్కడ పడిందో ఇన్నాళ్ళకు తెలిసొచ్చిందా? కోలుకోవడం కోసం మొదలుపెట్టిన ప్యాచ్ వర్క్ ఏంటి? అది ఎంత వరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? అసలు బీఆర్ఎస్ పోగొట్టుకున్నది ఎక్కడ? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేయాలనుకుంటోంది ఆ పార్టీ? తెలంగాణలో బీసీ జనాభా దాదాపు 56 శాతం. ఎన్నిక ఏదైనా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం బీసీలే. అయితే… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వాస్తవాన్ని విస్మరించడంవల్లే… పవర్‌కు…
కేసీఆర్, కేటీఆర్‌లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు మహిళకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వని సన్నాసులకు మహిళా అభివృద్ధి గురించి ఏం తెలుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన కంప్యూటర్ పరిజ్ఞానంతోనే అమెరికా వెళ్లి జాబ్ చేశావు.. ఐటీ మంత్రి అయ్యావ్, లేకపోతే కేటీఆర్ మంత్రి దరిద్రం ఉండేది కాదు అని విమర్శించారు.
Jagga Reddy: మా సీఎం రేవంత్ రెడ్డిని.. పనికి రాని వాడు అంటే.. కేటీఆర్ కానీ.. వాళ్ళ అయ్య (కేసీఆర్) కానీ ఎవరన్నా సరే నాలుక కోస్తం అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జాతీయ ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి.. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని.. వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో పర్యటిస్తూ భారత్ ను కించపర్చడమే కాకుండా ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తున్న రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. ‘‘మిస్టర్ రాహుల్ గాంధీ… క్విట్ ఇండియా’’ అని నినదించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని చెప్పిన బండి సంజయ్… అందరూ కలిసి పోటీ చేసినా ఈసారి జీహెచ్ఎంసీపై కాషాయ…
Lakshma Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే చెర్లకోళ్ల లక్ష్మారెడ్డి భార్య శ్వేతా లక్ష్మారెడ్డి సోమవారం రాత్రి మృతి చెందారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కున్న భక్తిప్రపత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సమకాలీన రాజకీయాల్లో యాగాలతో సెంటిమెంట్‌ను పండించే అతికొద్ది మంది నేతల్లో ఒకరు కేసీఆర్. గతంలో ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో చండీయాగం, రాజశ్యామల యాగంతోపాటు రకరకాల పూజలు నిర్వహించారాయన. అయితే ఈసారి గతానికి భిన్నంగా నవగ్రహ శాంతి యాగం నిర్వహించారట.
KCR Chandi Yagam: వ్యవసాయ క్షేత్రం గజ్వేల్ ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు నవగ్రహ యాగం, చండీ యాగం నిర్వహిస్తున్నారు. యాగానికి సంబంధించి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి వేద పండితులతో పూజలు ప్రారంభమయ్యాయి.