CM Revanth: కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై సీఎం కీలక వ్యాఖ్యలు..
- సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్
- కేసీఆర్ ఉనికి లేకుండా చేయాలనేది నా అభిమతం- సీఎం రేవంత్
- కేటీఆర్ తోని కేసీఆర్ ఉనికి లేకుండా చేశాను- సీఎం
- మూసీ పై అఖిలపక్షానికి రెడీ- ముఖ్యమంత్రి
- కేసీఆర్.. కేటీఆర్ బామ్మర్దులు పార్టీలు చేసుకోవడానికి ఫార్మ్ హౌస్‌లు ఉన్నాయి
- మూసీ పక్కన సామాన్య ప్రజలు దుర్భర జీవితం గడపాలా- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉనికి లేకుండా చేయాలనేది తన అభిమతం అన్నారు. కేటీఆర్‌తోని కేసీఆర్ ఉనికి లేకుండా చేశాను.. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడానికి ఆయన కొడుకునే వాడానని అన్నారు. ఇక భవిష్యత్తులో కేటీఆర్‌ని రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన బావ హరీష్ రావుని వాడుతానని తెలిపారు. మరోవైపు.. మూసీ పై అఖిలపక్షానికి రెడీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు తనను కలవడం ఇష్టం లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కైనా మూసీ పైనా అభిప్రాయాలు ఇవ్వండని సూచించారు. ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి.. ఎలాంటి అభిప్రాయాలనైనా తీసుకోవడానికి తాను రెడీగా ఉన్నానని సీఎం చెప్పారు.
Bangladesh: షేక్ హసీనా లగ్జరీ ప్యాలెస్.. ఇప్పుడు ‘‘విప్లవ మ్యూజియం’’..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
చర్చ జరగకుండా అభివృద్ధి జరగదు.. తాను మూసీ పై చర్చ జరగాలని కోరుకుంటున్నాను.. అందుకే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. అఖిలపక్షానికి మీరు వస్తే కచ్చితంగా మూసీ పై అఖిలపక్షం పెడతానని అన్నారు. మూసీలో జీవించడానికి.. మూసీ పక్కన ఉండడానికి ఎవరికి ఇష్టం ఉండదు.. మూసీలో లగ్జరీ ఉంటుందా అని సీఎం పేర్కొన్నారు. కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు ఎందుకు అర్థం కావడం లేదని అన్నారు. మూసీ జనాలను మూసీలోనే ఉండాలని కోరుకుంటున్నారా.. ఈటల రాజేందర్ మూసీ పైన చేస్తున్న అభ్యంతరాలు నిర్మాణాత్మకంగా లేవు.. అతనిపైన కేటీఆర్, హరీష్ రావు ఒత్తిడి ఉందని సీఎం తెలిపారు. మూసీ పునర్జీవం కోసం రూ. 1,50,000 కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెడుతున్నారు అనేది నిజం కాదు.. నిధులన్నీ ప్రైవేటు సంస్థలతోనే సమీకరించి వాళ్లతోనే ఖర్చు చేయించి మూసీని సుందరీకరణ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
Ram Pothineni: మహేష్ బాబుతో రామ్ పోతినేని.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
మరోవైపు.. కేసిఆర్, కేటీఆర్ బామ్మర్దులు పార్టీలు చేసుకోవడానికి ఫార్మ్ హౌస్‌లు ఉన్నాయి.. మూసీ పక్కన సామాన్య ప్రజలు దుర్భర జీవితం గడపాలా అని అన్నారు. గండిపేట ఏరియాలో ఫామ్ అవధులు కట్టుకొని మీ కాలుష్యం అంతా మూసీ పైన వదులుతున్నారు.. వాళ్లు ఆ కాలుష్యంతో బతకాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పుడు నాలుగు గోడల మధ్య పరిమితమై ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యాడు అంటే అది తన వల్లే అయిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కేటీఆర్‌ని బయటికి తీసుకొచ్చి తండ్రిని ఫామ్ హౌస్ పరిమితం చేశాని ముఖ్యమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?