బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కున్న భక్తిప్రపత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సమకాలీన రాజకీయాల్లో యాగాలతో సెంటిమెంట్‌ను పండించే అతికొద్ది మంది నేతల్లో ఒకరు కేసీఆర్. గతంలో ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో చండీయాగం, రాజశ్యామల యాగంతోపాటు రకరకాల పూజలు నిర్వహించారాయన. అయితే ఈసారి గతానికి భిన్నంగా నవగ్రహ శాంతి యాగం నిర్వహించారట.
KCR Chandi Yagam: వ్యవసాయ క్షేత్రం గజ్వేల్ ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు నవగ్రహ యాగం, చండీ యాగం నిర్వహిస్తున్నారు. యాగానికి సంబంధించి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి వేద పండితులతో పూజలు ప్రారంభమయ్యాయి.
Revanth Reddy Chitchat: ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుండె కరిగిపోయే దృశ్యాలు… మనసు చెదిరిపోయే కష్టాలు…స్వయంగా చూశానని తెలిపారు.
కేసీఆర్ ట్రెండ్ మార్చబోతున్నారా? ఇక దూకుడు పెంచబోతున్నారా? అందుకోసం కీలక నిర్ణయం తీసుకున్నారా? దాని ప్రభావంతో కేడర్‌లో ఊపు వస్తుందా? ఎన్నికల ఫలితాలు, వలసలతో డీలాపడ్డ గులాబీ దళంలో ఉత్తేజం నింపడానికి కేసీఆర్ అందించబోతున్న ఆ చవన్ప్రాస్ ఏంటి? దాని ప్రభావం నిజంగానే ఆ రేంజ్లో ఉంటుందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం పదహారు శాతం ఓటు బ్యాంక్‌కు పరిమితం కావడం, పార్టీ చరిత్రలో తొలిసారి లోక్‌సభలో…
Jagga Reddy: సీఎం రేవంత్ నీ కేసీఆర్ అపాయింట్ మెంట్ అడుగు.. ఇవ్వడా.. సచివాలయం వెళ్లి సమస్యలపై చర్చ చెయ్ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
MLC Kavitha: ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా కవిత తన తండ్రిని కలిశారు. కవిత తన భర్త, కుమారుడితో కలిసి ఈరోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి నివాసానికి వెళ్లారు.
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆమె ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నారు.
ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పోతే డ్రోన్లు ఎగురవేశారని కేసులు పెట్టారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పుడెందుకు కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఆయన మరి ఆ రోజే ఫామ్ హౌస్ నాది కాదని కేటీఆర్ చెబితే అయిపోవు కదా?.. కానీ ఇప్పుడు ఇతరుల పేరుపై మార్చి నాది కాదు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
కేటీఆర్.. జన్వాడ ఫాం హౌస్ నాది కాదంటారు..? మిత్రున్ని కోర్టుకు పంపించారు.. అక్రమ నిర్మాణం కూల్చాలి అంటారు.. ఇంకో పక్క కోర్టులో స్టేకి వెళ్ళారని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ పక్కన ఉండే చిల్లర మనుషులు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరికి ఉన్నా.. హైడ్రా తన పని తాను చేస్తుందన్నారు.