తెలంగాణలోని వరి రైతులు షాక్ ఇస్తూ తెలంగాణ సర్కార్ ఓ ప్రకటన చేసింది. వేసవిలో వరి వేయద్దని మరోసారి తేల్చిచెప్పింది. దీనిపై మీడియాతో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వానకాలం పంటను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. యాసంగిలో వరి వేస్తే మాత్రం కొనే ప్రసక్తే లేదని ఆయన ఉద్ఘాటించారు. విత్తనం కోసం మాత్రం వరి వేసుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా కామారెడ్డి రైతు మృతిపై విచారణ కోరామని, దయచేసి యాసంగిలో రైతులు వరి…
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పై నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో ఖరీఫ్ పంట కొనుగోళ్లలో, రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులకు మద్ధతు ధర లభించడం లేదని, ప్రభుత్వ తీరు మారకుంటే కాంగ్రెస్ రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరగకపోతే ఆమరణ…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిన విషయం విధితమే. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డిని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెడుతామని ప్రకటన కూడా చేశారు. అనంతరం జరిగిన హుజురబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.…
సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్ డీజిల్ ధరల పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని డీకే అరుణ అన్నారు. Also Read : హైదరాబాద్ కు ఈటల.. సిద్ధిపేటలో ఆగి ఏం చేశారంటే.. కేంద్ర ప్రభుత్వం…
హుజురాబాద్ ఈటల రాజేందర్ కంచుకోట అనడంలో సందేహం లేదనిపిస్తోంది. ఎందుకంటే.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసీఆర్. ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా దళిత బంధు, మహిళలకు మహిళా సంఘాల భవనాలకు భారీ నిధుల మంజూరు లాంటి సంక్షేమ పథకాలను హుజురాబాద్ ఓటర్ల ముందు…
ఎప్పుడెప్పుడా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నికకు నేటితో తెరపడనుంది. ఈ రోజు ఉదయం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో ప్రారంభమైన హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఆధిక్యం వచ్చినా.. తిరిగి తొమ్మిదో రౌండ్ నుంచి ఈటల తన సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా పదో రౌండ్లో కూడా ఈటల…
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకంజలో ఉన్నా… ఈవీఏంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్‌లో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లో 166, రెండవ రౌండ్లో 192, మూడవ రౌండ్లో 911 ఓట్ల ఆధిక్యతను సాధించారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి 1,825 ఓట్ల లీడ్‌లో ఉండగా.. ఐదో రౌండ్లో కూడా ఈటల తన సత్తా చాటి 2,169 ఓట్ల…
హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు టీఆర్ఎస్కు ఆధికంగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఈవీంఏంలలోని ఓట్లను లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 22 రౌండ్లు నిర్వహించనుండగా.. తొలి రౌండ్లో బీజేపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. మొదటి రౌండ్ లో 166 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తొలిరౌండ్లో బీజేపీకి 4,610…
5 నెలల ఉత్కంఠకు తెరపడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి పోస్టల్ బ్యాలెట్లో ఉన్న 753 ఓట్లను లెక్కించి టీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈవీఏంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొత్తం 22 రౌండ్లలో హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ముందుగా హుజురాబాద్ ఓట్లను లెక్కించనున్నారు.
యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక గత నెల 30న జరిగింది. ఫలితాల కోసం రెండురోజులుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు. హుజురాబాద్ కౌంటింగ్ ప్రారంభమయింది. హుజురాబాద్ మండలంలోని 14 గ్రామాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల లెక్కింపు జరుగుతుంది. హుజురాబాద్‌లోని పోతిరెడ్డిపేట తొలి గ్రామం కాగా, కమలాపూర్ మండలం శంభునిపల్లి…