ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ఒకలా చెబితే… ఇక్కడ బండి సంజయ్ మరోలా మాట్లాడుతున్నారన్నారు. బండి సంజయ్ చిన్న పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను జైలుకు పంపుంతా అన్న బండి సంజయ్ నన్ను జైలుకు పంపి బతికి బట్టకడతావా..? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ను టచ్ చేసి చూడు ఏంటో తెలుస్తుంది అని…
తెలంగాణ సీఎం కేసీఆర్ టీబీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోంటే.. ఇక్కడ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ చీప్ బండి సంజయ్ రోడ్డుమీద నిరసనలు చేపడుతున్నారన్నారు. ఇప్పటికే చాలా సార్లు బండి సంజయ్ తనపై వ్యాఖ్యలు చేశారని.. తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదన్నారు. కానీ.. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరును…
రైతు బంధులాంటి పథకం ఎక్కాడా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణను చేపట్టమని చెబుతోందన్నారు. అందుకే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ యాసంగిలో వరి పంట వేయొద్దని చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా ధాన్యం తీసుకోబోమని చెప్పడం శోచనీయమన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ధాన్యాన్ని కూడా…
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతు బీరయ్య మృతి చెందాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు చేయ లేదన్న బాధతోనే రైతు మృతి చెందాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో కలెక్టర్ల నివేదికలకు విలువ లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన ప్రభు త్వం అది వదిలేసి మద్యం దుకాణాలకు నోటిఫికేషన్లు ఇస్తుందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి…
రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం మాత్రేమ అమలు అవుతుందని, ఇక్కడ హక్కులు లేవని ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయనకు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడు తూ.. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.ఈ విజయాన్ని హుజు రాబాద్ ప్రజలకే అంకితమిస్తున్నట్టు ఆయన తెలిపారు. అధికారులు కేసీఆర్‌కు బానిసలుగా పనిచేశారని ఆయన మండిపడ్డారు. తమ వర్గాన్ని పోలీసులు ఎలా బెదిరించారో తన దగ్గర సీడీలు ఉన్నాయని, ఎన్నికల కమిషన్‌కు…
పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రం వ్యాట్‌ను తగ్గించాలనే డిమాండ్‌తో ఈనెల 8న బీజేపీ నిరసనలు చేపడుతందని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాని పన్నులు తగ్గించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఉన్న వ్యాట్ తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా…
తెలంగాణలోని వరి రైతులు షాక్ ఇస్తూ తెలంగాణ సర్కార్ ఓ ప్రకటన చేసింది. వేసవిలో వరి వేయద్దని మరోసారి తేల్చిచెప్పింది. దీనిపై మీడియాతో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వానకాలం పంటను మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. యాసంగిలో వరి వేస్తే మాత్రం కొనే ప్రసక్తే లేదని ఆయన ఉద్ఘాటించారు. విత్తనం కోసం మాత్రం వరి వేసుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా కామారెడ్డి రైతు మృతిపై విచారణ కోరామని, దయచేసి యాసంగిలో రైతులు వరి…
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పై నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో ఖరీఫ్ పంట కొనుగోళ్లలో, రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులకు మద్ధతు ధర లభించడం లేదని, ప్రభుత్వ తీరు మారకుంటే కాంగ్రెస్ రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరగకపోతే ఆమరణ…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయిన విషయం విధితమే. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డిని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెడుతామని ప్రకటన కూడా చేశారు. అనంతరం జరిగిన హుజురబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.…