5 నెలల ఉత్కంఠకు తెరపడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి పోస్టల్ బ్యాలెట్లో ఉన్న 753 ఓట్లను లెక్కించి టీఆర్ఎస్ కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈవీఏంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొత్తం 22 రౌండ్లలో హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ముందుగా హుజురాబాద్ ఓట్లను లెక్కించనున్నారు.
యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక గత నెల 30న జరిగింది. ఫలితాల కోసం రెండురోజులుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు. హుజురాబాద్ కౌంటింగ్ ప్రారంభమయింది. హుజురాబాద్ మండలంలోని 14 గ్రామాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల లెక్కింపు జరుగుతుంది. హుజురాబాద్‌లోని పోతిరెడ్డిపేట తొలి గ్రామం కాగా, కమలాపూర్ మండలం శంభునిపల్లి…
ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన హుజురాబాద్ ఉప ఎన్నికు ఈ రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఏజెంట్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పాసులు ఉన్నా మమల్ని అనుమతించడం లేదంటూ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టి వెల్లడంతో వారిని లోపలికి అనుమతించాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు…
గత 5 నెలల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఉప ఎన్నికల నోటిషికేషన్ వచ్చిననాటి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి ప్రజలను ఎంతవరకు ఒప్పించారనేది ఈ రోజుతో తేలనుంది. ఓటర్లు మెచ్చిన లీడర్ ఎవరో నేటి ఓట్ల లెక్కింపుతో బయట పడనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం ఈవీఏంలను కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే ఏర్పాటు చేసిన…
బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం ఎమ్మెల్యే రాజాసింగ్ అధ్యక్షతన సోమవారం జరిగింది.ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై విమర్శలు సంధించారు. ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నికపైనే ఈ సమావేశం జరిగినట్టు ఆయన వివరించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయ త్నాలు కేసీఆర్ చేశారన్నారు. సర్వేల ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజాసింగ్ విమర్శించారు. కేసీఆర్ ఎన్ని సర్వేలు చేయించుకున్నా బీజేపీ గెలుస్తుందని రిపోర్ట్ రావడంతో చివరకు డబ్బులు పంచి గెలవాలని చూశాడని…
తెలంగాణలో తాజాగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నేతల పైరవీలు, ఆశవాహుల ఎదురు చూపులతో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఒక మినీ యుద్ధమే నడుస్తుందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆయా నేతలు తమ కంటే తమకు అని నేతలు ఎవరికి వారే పోటీ పడుతున్నారు. ప్రస్తుతం శాసనసభలో ఒక నామినేటడ్ స్థానంతో కలిపి మొత్తం 120 స్థానాలు ఉండగా, ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఖాళీ అయింది.…
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో పండిన పంటను, ఒక గింజ కూడా కొనలేము అని ఎఫ్‌సీఐ, కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన సహకారం రావడం లేదని, ఎఫ్‌సీఐ ఎప్పటికప్పుడు వడ్లు తీసుకోకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఢిల్లీలోని ప్రభుత్వం వడ్ల కొనుగోలు పై మొండివైఖరి…
కేసీఆర్ రాష్ట్రానికిఏం చేశారో చెప్పాలని పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిళ అన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆమె కేసీఆర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉచిత విద్యంటూ విద్యార్థులను, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నిరుద్యోగులను, వడ్డీ లేని రుణాలంటు డ్వాక్రా మహిళలను, రైతులను, రిజర్వేషన్లు పెంచుతానని మూడెకరాల భూమి ఇస్తానని ఎస్సీ ఎస్టీలను, డబుల్ బెడ్రూంలు ఇస్తానని పేదలను మోసం చేశారని ఆమె అన్నారు. మంచోడు మంచోడు అంటే మంచం కోళ్లు…
రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల ఆధైర్యపడవద్దని కేంద్ర కొనకపోయినా మేం ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. అంతేకాకుండా అధికారులు గతంలోని అనుభవాలతో ముందు సాగాలని సూచించారు. రైతులకు సాగునీరు, 24 గంటల విద్యుత్, పంట పెట్టుబడి ఇస్తున్న ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. అంతేకాకుండా కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. చివరి ధాన్యపుగింజను…
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ విజయవంతంగా ముగిసింది. అయితే కొన్నిచోట్ల స్వల్ప వాగ్వాదాలు చోటు చేసుకున్నప్పటికీ మినహా పోలింగ్ ప్రక్రియ హుజురాబాద్ నియోకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ.. హజురాబాద్ ఓటర్లు చైతన్యం చాటారని ప్రశంసించారు. కేసీఆర్ మార్గదర్శకత్వం, హుజురాబాద్ ప్రజల ఆశీస్సులతో గొప్ప విజయం సాధించబోతున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉప ఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన…