వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ర్టంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షాలకు మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికే చాలా చోట్ల వరిధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తుండటంతో పలు చోట్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే రాజకీయ నాయకులు మాత్రం వరి పంటనే కేంద్రంగా విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ రణరంగా మార్చుతున్నారు. తాజాగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వరిధాన్యం…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో అభిలాష్ రావు చేరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు. కొల్లాపూర్‌ను దున్నండి.. కాంగ్రెస్ విత్తనాలు నాటుదాం ఎవ్వరు ఆపుతారో చూస్తామంటూ వ్యాఖ్యానించారు. ఒక్క కొల్లాపూరే కాదు.. వనపర్తి కోట మీద కూడా ఎగిరేది కాంగ్రెస్ జెండానే అన్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పని చేసి గెలిపిస్తే ఆ సన్నాసి పార్టీ వదిలిపోయిండన్నారు.…
తెలంగాణ విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్ ను రాబోయే 3 సంవత్సరాలలో 1500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సాధించే విధంగా సమగ్ర కార్యాచరణ ను రూపొందించాలని రాష్ట్ర పశు సంవ ర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తుల మార్కెటింగ్, నూతన ఔట్ లెట్ ల ఏర్పాటు, ఇతర కార్యక్రమాల…
వరి సేద్యం పై ఆంక్షలు విధించడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు మాట్లాడుతూ టీఆర్ఎస్ పై విమర్శల దాడికి దిగారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్లు వారి ప్రాథమిక బాధ్యతను విస్మరించాయన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి వరి వద్దు.. పామాయిల్ పంట వేసుకోమ్మంటాడని, పామాయిల్ లాంగ్ టర్మ్ పంట అని ఆయన అన్నారు. వరి రైతు లకు…
ఖరీఫ్ పంట రోడ్డు మీద ఉంటే పంట కొనే ధ్యాస ఈ ప్రభుత్వానికి లేదని నారాయణపేట కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తు వ్యాఖ్యలు చేశారు. మా పంట కొనండి అని రైతులు ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడ్డట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ బీజేపీలు రెండు కుమ్మకై నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్రం ఖరీఫ్‌లో పండించింది మేము తీసుకుంటామని చెప్పిన, మనం పండించిన పంటను ఎందుకు కొనరో…
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. రెగ్యులర్ టెస్ట్‌లతో పాటు చేసిన టెస్టుల్లో కోవిడ్ సోకినట్లు తెలిసింది. ఈ క్రమంలో కోవిడ్ సోకినప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని పోచారం వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా గత కొన్ని రోజుల తనతో సన్నిహితంగా మెదిలిన వ్యక్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇటీవల పోచారం శ్రీనివాస్ మనవరాలి పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తెలుగు…
రైతుల ఉసురు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తగులుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులపై కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సీజన్లో ధాన్యం ఎంతయినా కొనాలని కేంద్రం స్పష్టంగా చెప్పిందని, అయినా కేసీఆర్ వచ్చే సీజన్‌కు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు ముందు చూపు లేకపోవడం వల్లనే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తక్కువ ధరకు వడ్లు అమ్ముకొవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రైతులతో పెట్టుకున్న వారు ఎవ్వరూ ముందుకు పోలేదని కేసీఆర్…
ధాన్యం రోడ్ల మీద ఉందని దాన్ని వెంటనే కొని రైతుల ఇబ్బందులను తీర్చానలి కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు.నీళ్ల పంచాయతీని కేంద్ర, రాష్ర్ట ప్రభు త్వాల సమస్యల లెక్కన చూస్తున్నారు. దీనిపై అసలు ఏం జరుగు తుందో కేంద్రానికి, రాష్ర్టానికి మధ్యన జరుగుతున్న చర్చల సారాం శం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పష్టతను ఇవ్వాలన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం కొనక పోతే…
ధాన్యం కొనుగోలు విషయమై నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీలో మూడో రోజు పర్యటిస్తున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో టీఆర్ఎస్ నేతలు భేటీ కానున్నారు. అయితే కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి ఎంపీ నామా నాగేశ్వర్రావు లు ఈ భేటీలో పాల్గొననున్నారు. అయితే ఈ భేటీలో తెలంగాన నుంచి ప్రతి సంవత్సరం ఎంత ధాన్యాన్ని ఏ రూపంలో కొనుగోలు చేస్తారో.. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని టీఆర్ఎస్…
తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థ కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కేసీఆర్ కూతురు కవితను మరోసారి ఎమ్మెల్సీగా ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత పదవీకాలం జనవరి 4న ముగియనుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆ రాజ్యసభ ఆ స్థానంలో రాజ్యసభకు కవితను వెళ్లబోతుందంటూ ప్రచారం…