సీఎం కేసీఆర్ సోమవారం శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి బేగంపేటకు చేరుకుంటారు. 11.10కి ప్రత్యేక విమానంలో బయలుదేరి 12.30కు తమిళనాడులోని తిరుచి చేరుకుంటారు. హోటల్‌లో బస అనంతరం. రోడ్డు మార్గంలో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 2.10కి ఆయన రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు చేయిస్తారు. 3 గంటలకు తిరుచి విమానాశ్రయానికి పయనమవుతారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుని, ఐటీసీ గ్రాండ్ చోళలో బస చేస్తారు. చెన్నైలో ఆయన తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్‌ను కలుస్తారు.
అనంతరం రాత్రి చైన్నైలోనే బస చేయనున్నారు. రేపు తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పలు అంశాలపై చర్చలు జరుపుతారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై స్టాలిన్‌తో చర్చించనున్నారు. అంతేకాకుండా కేంద్రం రాష్ర్టాలపై అనుసరిస్తున్న వైఖరి, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై రెండు రాష్ర్టాల సీఎంలు సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.