తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఈడీ నోటీసుల భయంతోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి పరుగులు పెట్టారన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, బీజేపీలోకి ఎవ్వరు వచ్చిన చేర్చుకుంటామని ఆయన అన్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు ఉంటాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ రాష్ర్టంలో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి సైతం పోటీ చేస్తానని ధర్మపురి అరవింద్ చెప్పారు. కాగా రాష్ర్టంలో అరాచక పాలనకు టీఆర్‌ఎస్ తెరతీసిందన్నారు. రైతులపై కేసీఆర్ వైఖరిని ఎండగడతామని అరవింద్ పేర్కొన్నారు. బీజేపీ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని పార్టీలో కష్టపడిన వారికి తప్పక ఫలితముంటుందని అరవింద్ అన్నారు.