బీజేపీ నేత వివేక్ వెంకట్ స్వామి తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. మహబూబాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎంపీ వివేక్ బీజేపీ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్ల చేయాలన్నారు. తమను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరుని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు.
కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రధాని ముందు చూపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందన్నారు. థర్డ్ ఫ్రంట్ విషయం పై స్పందించిన వివేక్. గతంలో మాదిరిగానే తుస్సు మంటుందని జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తుందన్నారు.
రాష్ట్ర అవతరణ తర్వాత ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ కుటుంబానికే 5 పదవులు వచ్చాయని, నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదన్నారు. 2023 లో బీజేపీ ఆధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 5 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం మంజారు చేసిందన్నారు. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు.