వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని సీపీఎం మాజీ ఎమ్మెల్యే, రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటిరంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మహబూబ్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకోవాలని చూస్తే రైతులు చూస్తూ ఊరు కోరని వారి పక్షాన సీపీఎం పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే కళ్లాల వద్ద ధాన్యం వానలకు తడిసి, ఎండలకు ఎండుతుందని మార్కెట్లలో మౌలిక…
హుజురాబాద్ ఉప ఎన్నిక మినీ రాజకీయ యుద్ధాన్ని తలపించింది. అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరి పోటీ కొనసాగింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ చేయని ప్రయత్నం లేదు. ఒకరి మీద కరు విమర్శలు ప్రతి విమర్శలతో మాటల దాడికి దిగారు ఆయా పార్టీల నేతలు. అధికార పార్టీ దొంగల పార్టీ అని బీజేపీ వాళ్లు అంటే .. టీఆర్ఎస్ పార్టీనే దొంగల పార్టీ అని బీజేపీ నాయకులు ఒకరి పై…
జనగామ మండలం పెంబర్తి గ్రామంలోని శివమ్ గార్డెన్ లో జరుగుతున్న BJP జనగామ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈటల రాజేందర్ హుజారాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన తరువాత మొదటిసారి జిల్లాకు రావడంతో బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ ..కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందన్నారు. దీనిని నియంత్రించే శక్తి ఒక్క…
రంగారెడ్డి జిల్లా బీజేపీ శిక్షణ తరగతుల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. గొప్ప రాజ్యాంగం ఉన్న ఈ దేశంలో.. హుజూరాబాద్‌లో కేసిఆర్ నియంతృత్వంతో స్వేచ్ఛను హరించారన్నారు. స్వేచ్ఛ మీద ఉక్కుపాదం పెట్టారు. అందుకే అక్కడ ప్రజలు బయటికి మాట్లాడకుండా ఉండి అవకాశం వచ్చినపుడు ఓటుతో తమ శక్తిని చూపించారని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ కోరలు పీకారు. చెంప చెళ్లుమనిపించి…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (88) పార్ధీవ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.మరణవార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి చేరుకుని రోశయ్య పార్థీవ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి, నివాళులర్పించారు.బాధలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా పలు పదవులకు…
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టతనివ్వకపోవడంతో రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ రోజు సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో వివిధ రకాల పంటలను పరిశీలించారు. అంతేకాకుండా అక్కడి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు సాగు చేయాలన్నారు. వరిలాంటి ఒకే రకం పంట వేసి ఇబ్బంది పడొద్దని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని ఆయన…
సీఎం కేసీఆర్ ఇక జైలుకు పోవడం ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్‌పై వస్తున్న ఆరోపణలపై త్వరలోనే సీబీఐ, ఈడీ విచారణ చేస్తుందని వంద శాతం జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గిస్తే రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా పెట్రో, డీజీల్‌పై పన్నును తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలన్నారు. డిజీల్ ధరలు…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో ఇంకా స్పష్టత రాలేదు. ఓ వైపు అధికారి టీఆర్ఎస్ పార్టీ అధినేత ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర స్పష్టత ఇవ్వలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మరో వైపు తెలంగాణ బీజేపీ నేతలు వానాకాలంలో పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులును మోసం చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే కర్షకుల కోసం కాంగ్రెస్ అంటూ రైతులకు న్యాయం చేయాలని…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయలేక డ్రామాలు ఆడుతోందని బీజేపీ నేతలు అంటుంటే.. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేతలు సైతం ధాన్యం కొనుగోళ్లు చేసిన రైతులకు న్యాయం చేయాలంటూ వరి దీక్షలకు కూడా దిగారు. తాజాగా మాజీ పీసీసీ ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.…
రైతుల సంక్షేమం విషయంలో దేశానికే మార్గదర్శి తెలంగాణ సీఎం కేసీఆర్ అంటూ ప్రశంసలు కురిపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి… నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీయే అంటూ మండిపడ్డారు… రబీ ధాన్యం ఇంకా 50 శాతం ఎఫ్ సీఐ గోదాముల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్లు ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు… ఇక, ధాన్యం సేకరణ పై…