ఇళ్ల విషయంలో ఎలాంటి పైరవీలు ఉండవని, లాటరీ పద్ధతిలో బస్తీవాసులకు ఇళ్లు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట డివిజన్ చాచా నెహ్రూనగర్లో నిర్మించిన 248 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని పేదలందరికి ఇండ్లు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. Also Read: లాభాల్లో ఉన్న బ్యాంకులను అమ్మడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే: గుత్తా సుఖేందర్రెడ్డి నిరుపేదలకు ఇండ్లు…
రాష్ర్టప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణకు హరితహారం పథకం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగడానికి రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆకుపచ్చ తెలంగాణ మార్చడానికి కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేస్తోంది. ఇప్పటికే ఈ పథకాన్ని గ్రామస్థాయి నుంచి అమలు చేసి హరిత తెలంగాణ నిర్మించడంలో ప్రభుత్వం కొంతమేరకు విజయవంతం అయిందని చెప్పవచ్చు. ఈ పథకంలో గ్రామ స్థాయినుంచి ప్రతి ఒక్కర్ని భాగస్వామ్యం చేసి మంచి ఫలితాలు సాధించారు. Also Read: ఇక్కత్ చేనేత కార్మికులకు ప్రోత్సాహం:…
నాకు హుజురాబాద్ నియోజకవర్గం ఉందని, ఒకవేళ పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద పోటీకి సిద్ధమని ఈటల రాజేందర్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్పై విమర్శలు చేశారు. ధాన్యం విషయంలో కేసీఆర్ తన వైఫల్యాన్ని కేంద్రం పై మోపుతున్నాడని ఈటల అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వాళ్ల మంత్రుల మాటలను తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితిలో లేదన్నారు. ఇంత నీచంగా హరీష్రావు ప్రవర్తిస్తారని తెలంగాణ ప్రజలకు తెల్సింది. ప్రాంతీయ పార్టీల్లో వారసులే సీఎంలు అవుతారు. బీజేపీ…
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శల దాడికి దిగారు. గురువారం ఈటల మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. హుజురాబాద్ ప్రజలకు ఉన్న సోయి రాజకీయ నాయకులకు లేకుండా పోయిందన్నారు. ప్రగతి భవన్కు కేసీఆర్ మముల్ని రానియలేదు…. ఆ రోజు నాతో పాటు ఉన్న ఎమ్మెల్యే.. ఇప్పుడు కేబినెట్ మినిస్టర్ అయ్యారు. మళ్ళీ ఉద్యమం కరీంనగర్ నుండే పుడుతుందని ఈటల అన్నారు. రైతుబంధుఉన్నోళ్లకు ఇవ్వొద్దని అన్న… డబ్బులు చెట్లకు కాయవు. రైతు కూలీలకు,…
తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈనెల 19 నుంచి జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ పర్యటన వనపర్తి జిల్లా నుంచి మొదలు పెట్టనున్నారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. వేరుశనగ పరిశోధన కేంద్రం, కర్నె తండ ఎత్తిపోతల పథకం, సబ్ రిజిస్టర్ కార్యాలయం, కొత్త కలెక్టరేట్, రెండు పడకల గదులు ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 20న సోమవారం జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. జనగామలో కూడా…
బీజేపీ నేత వివేక్ వెంకట్ స్వామి తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. మహబూబాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎంపీ వివేక్ బీజేపీ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్ల చేయాలన్నారు. తమను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరుని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రధాని ముందు చూపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందన్నారు. థర్డ్ ఫ్రంట్ విషయం…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రికార్డు చెక్కు చెదరలేదు. 98 శాతం ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ గా పోచంపల్లి అప్పట్లో చరిత్ర సృష్టించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కు 2019 జూన్ 3 న ఉప ఎన్నిక జరిగింది. మొత్తం ఓటర్లు 902 మంది ఉండగా 883 మంది ఓటు వేశారు. 848 ఓట్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి పడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు…
తెలంగాణలో పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులు, రైతులు నష్టపోయిన తీరుపై ఎలాంటి పరిహారం ఇచ్చారో చెప్పాలని జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) రాష్ర్టప్రభుత్వాన్ని, కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశంచింది. దీనిపై 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సరైన అధ్యయనం చేయకుండానే ప్రాజెక్టును నిర్మించడంతో 50వేల ఎకరాలకు మేర సారవంతమైన పంట భూములు మునిగిపోయాయి. దీంతో రైతులతో పాటు కౌలు రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారని న్యాయవాది శ్రవణ్ NHRC…
రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు, నిధుల పంపిణీ అంశంపై అధికారులు ఇప్పటికే దృష్టి పెట్టారు. వీలైనంత వేగంగా రైతులఖాతాల్లో డబ్బులు జమ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటికే ఏడున్నర వేల కోట్ల నిధులను… సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారు. డిసెంబర్ 15 అంటే రేపటి నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని సీఎం…
మూడు రోజుల సమ్మె జీతాన్ని ప్రతి కార్మికుడికి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. సోమవారం గోదావరిఖనిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణిలో జరిగిన సమ్మె రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సమ్మెగా ఆయన అభివర్ణించారు. సింగరేణిలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. కానీ ఈ మూడు రోజుల సమ్మెలో బొగ్గు ఉత్పత్తి జరగలేదంటే యాజమాన్యం, రాష్ర్ట ప్రభుత్వ తీరును…